'నా వైపు చూసి బాగా నవ్వింది.. చంపేశా' | Husband 'killed wife on luxury cruise ship | Sakshi
Sakshi News home page

'నా వైపు చూసి బాగా నవ్వింది.. చంపేశా'

Jul 29 2017 1:43 PM | Updated on Jul 30 2018 8:37 PM

'నా వైపు చూసి బాగా నవ్వింది.. చంపేశా' - Sakshi

'నా వైపు చూసి బాగా నవ్వింది.. చంపేశా'

విలాసవంతమైన నౌకపై ప్రయాణానికి తీసుకెళ్లిన ఓ భర్త తన భార్యను అనూహ్యంగా హత్య చేశాడు. తనవైపు చూసి పదే పదే నవ్విందనే కారణంతో ఆమె తనను బలంగా కొట్టి దారుణంగా హత్య చేశాడు.

అలస్కా: విలాసవంతమైన నౌకపై ప్రయాణానికి తీసుకెళ్లిన ఓ భర్త తన భార్యను అనూహ్యంగా హత్య చేశాడు. తనవైపు చూసి పదే పదే నవ్విందనే కారణంతో ఆమె తనను బలంగా కొట్టి దారుణంగా హత్య చేశాడు. దీంతో ఆ నౌకలో వారు తీసుకున్న గది కాస్త రక్తపు మడుగులా మారింది. ఈ సంఘటన అలస్కాలో చోటు చేసుకుంది. కెన్నెత్‌ మాన్‌జనరేస్‌, కిర్‌స్టీ అనే భార్యభర్తలు అలస్కాలోని ప్రిన్సెస్‌ క్రూయిజ్‌ అనే విలాసవంతమైన భారీ నౌకలోకి షికారుకు వెళ్లారు. అందులోకి వెళ్లాక ఒక ప్రత్యేకమైన గది తీసుకున్నారు.

అయితే, అందులోకి వెళ్లిన రెండు గంటల తర్వాత సర్వీస్‌ చేసే సిబ్బంది వచ్చి చూడగా రక్తపు మడుగులో పడి ఉన్న కిర్‌స్టీ కనిపించింది. ఏం జరిగిందని వచ్చిన వ్యక్తి అడగ్గా 'నా వైపు చూస్తూ ఆపకుండా అదే పనిగా నవ్వింది. అందుకే కోపంతో కొట్టాను' అని కెన్నెత్‌ చెప్పాడు. దీంతో ఘటన స్థలికి చేరుకున్న ఎఫ్‌బీఐ అధికారులు అతడిని అరెస్టు చేశారు. కోర్టు బెయిలిచ్చేందుకు నిరాకరిస్తూ కేసు విచారణ ఆగస్టు 10న చేస్తామని తెలిపింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement