Kirsty
-
‘నా ఆలోచనలను త్వరలోనే పంచుకుంటా’
కోస్టా నవారినో (గ్రీస్): అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షురాలిగా ఎంపికైన కిర్స్టీ కొవెంట్రీ భవిష్యత్తు ఒలింపిక్ ఆతిథ్య దేశాల అంశంలో కీలక వ్యాఖ్యలు చేసింది. 2036లో భారత్‌లో విశ్వక్రీడలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో కొవెంట్రీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. భవిష్యత్‌లో ఒలింపిక్స్ ఆతిథ్య దేశాల అంశంలో తన ఆలోచనలను త్వరలోనే వెల్లడిస్తానని కొవెంట్రీ పేర్కొంది. ‘ఈ ప్రక్రియ సుదీర్ఘ కాలం సాగుతుంది. భవిష్యత్తు ఆతిథ్య దేశం ఎంపికలో సభ్యులందరి పాత్ర ఉంటుంది. దీనిపై నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. వాటిని త్వరలోనే ఐఓసీ సభ్యులతో పంచుకుంటాను’ అని కొవెంట్రీ పేర్కంది. గురవారం జరిగిన ఐఓసీ ఎన్నికల్లో కొవెంట్రీ భారీ ఆధిక్యంతో విజయం సాధించింది. జూన్ 23తో ప్రస్తుత అధ్యక్షుడు థామస్ బాచ్ పదవీ కాలం ముగిసిన అనంతరం కొవెంట్రీ పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టనుంది. జింబాబ్వేకు చెందిన 41 ఏళ్ల కిర్స్టీ కొవెంట్రీ ప్రస్తుతం ఆ దేశ క్రీడా శాఖ మంత్రిగానూ వ్యవహరిస్తోంది. 2033 వరకు కొవెంట్రీ ఐఓసీ అధ్యక్షురాలిగా కొనసాగనుంది. ఆమె అధ్యక్షతన 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్, 2032 బ్రిస్బేన్ ఒలింపిక్స్ జరగనున్నాయి. దీంతో పాటు 2036 ఒలింపిక్స్ ఆతిథ్య దేశం ఎంపిక కూడా కొవెంట్రీ హయాంలోనే ఖాయం కానుంది. 2036 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కుల కోసం పదికి పైగా దేశాలు పోటీ పడుతున్నాయి. వీటిలో భారత్‌తో పాటు ఖతర్, సౌదీ అరేబియా కూడా ఉన్నాయి. ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’ సమర్పించడంతో... భారత్ తమ ఆసక్తిని ఇప్పటికే వెల్లడించింది. దీనిపై ఐఓసీ పూర్తి అధ్యయనం చేయనుంది. 2036 ఒలింపిక్స్‌కు సంబంధించిన ఆతిథ్య హక్కుల అంశంలో 2026లోగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ సన్నాహాలపై త్వరలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అవుతానని... ఆయన అధ్యక్షుడిగా ఉన్నపుడే 2017లో లాస్ ఏంజెలిస్‌కు ఆతిథ్య హక్కులు దక్కాయని కొవెంట్రీ తెలిపింది. 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ ద్వారా క్రికెట్ టి20 ఫార్మాట్ రూపంలో మళ్లీ విశ్వ క్రీడల్లో భాగం కానుంది. ఈ నేపథ్యంలో గ్రీస్‌లో జరిగిన ఐఓసీ సెషన్లో కిర్స్టీ కొవెంట్రీతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చైర్మన్ జై షా మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఐఓసీ అధ్యక్షురాలిగా ఎన్నికైనందుకు ఆమెకు అభినందనలు తెలిపారు. -
ఐఓసీకి తొలి మహిళా అధ్యక్షురాలు
కోస్టా నవారినో (గ్రీస్): విశ్వ క్రీడలకు సంబంధించి అత్యున్నత పదవి తొలిసారి మహిళను వరించింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షురాలిగా జింబాబ్వేకు చెందిన విఖ్యాత స్విమ్మర్, ప్రస్తుతం జింబాబ్వే ప్రభుత్వంలో క్రీడల మంత్రిగా ఉన్న కిర్స్టీ కొవెంట్రీ ఎన్నికయింది. ఈ అత్యున్నత పదవి కోసం ఏడుగురు పోటీపడగా... బరిలో ఉన్న ఏకైక మహిళా ప్రతినిధి 41 ఏళ్ల కిర్స్టీ కొవెంట్రీ తొలి రౌండ్లోనే స్పష్టమైన ఆధిక్యంతో విజయాన్ని దక్కించుకుంది. ఐఓసీలోని 97 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనగా... విజయానికి అవసరమైన 49 ఓట్లు కొవెంట్రీకి తొలి రౌండ్లోనే లభించాయి. ఒలింపిక్ దినోత్సవమైన జూన్ 23న ఐఓసీ అధ్యక్ష పదవిని అలంకరించనున్న కొవెంట్రీ ఎనిమిదేళ్లపాటు (2033 వరకు) ఈ పదవిలో కొనసాగుతుంది. ప్రస్తుతం ఐఓసీ అధ్యక్షుడిగా ఉన్న థామస్ బాచ్ ఈ పదవిలో గరిష్టంగా 12 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో అధ్యక్ష ఎన్నికలు నిర్వహించారు. కొవెంట్రీ అధ్యక్షతన 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్, 2032 బ్రిస్బేన్ ఒలింపిక్స్ జరుగుతాయి. 2036 ఒలింపిక్స్ ఆతిథ్య దేశం ఎంపిక కూడా కొవెంట్రీ హయాంలోనే ఖరారవుతుంది. ఏడు ఒలింపిక్ పతకాలు... ఐఓసీ అత్యున్నత పదవి దక్కించుకున్న తొలి ఆఫ్రికన్‌గా గుర్తింపు పొందిన కొవెంట్రీకి విశ్వ క్రీడల్లో ఘనమైన రికార్డు ఉంది. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో, 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో పోటీపడిన ఆమె మొత్తం 7 పతకాలు (2 స్వర్ణాలు, 4 రజతాలు, 1 కాంస్యం) సాధించింది. ఏథెన్స్ ఒలింపిక్స్‌లో కొవెంట్రీ 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో స్వర్ణం, 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో రజతం, 200 మీటర్ల మెడ్లీలో కాంస్యం దక్కించుకుంది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కొవెంట్రీ 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో పసిడి పతకం సాధించగా... 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో రజతం, 200 మీటర్ల మెడ్లీలో రజతం, 400 మీటర్ల మెడ్లీలో రజతం కైవసం చేసుకుంది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 7 స్వర్ణాలు, 5 రజతాలు, 1 కాంస్యంతో కలిపి మొత్తం 13 పతకాలు ఆమె సంపాదించింది. 2002 మాంచెస్టర్ కామన్వెల్త్ గేమ్స్‌లో 200 మీటర్ల మెడ్లీలో స్వర్ణం నెగ్గిన కొవెంట్రీ... ఆల్ ఆఫ్రికా గేమ్స్‌లో 14 స్వర్ణాలు, 7 రజతాలు, 1 కాంస్యం సాధించింది. -
'నా వైపు చూసి బాగా నవ్వింది.. చంపేశా'
అలస్కా: విలాసవంతమైన నౌకపై ప్రయాణానికి తీసుకెళ్లిన ఓ భర్త తన భార్యను అనూహ్యంగా హత్య చేశాడు. తనవైపు చూసి పదే పదే నవ్విందనే కారణంతో ఆమె తనను బలంగా కొట్టి దారుణంగా హత్య చేశాడు. దీంతో ఆ నౌకలో వారు తీసుకున్న గది కాస్త రక్తపు మడుగులా మారింది. ఈ సంఘటన అలస్కాలో చోటు చేసుకుంది. కెన్నెత్ మాన్జనరేస్, కిర్స్టీ అనే భార్యభర్తలు అలస్కాలోని ప్రిన్సెస్ క్రూయిజ్ అనే విలాసవంతమైన భారీ నౌకలోకి షికారుకు వెళ్లారు. అందులోకి వెళ్లాక ఒక ప్రత్యేకమైన గది తీసుకున్నారు. అయితే, అందులోకి వెళ్లిన రెండు గంటల తర్వాత సర్వీస్ చేసే సిబ్బంది వచ్చి చూడగా రక్తపు మడుగులో పడి ఉన్న కిర్స్టీ కనిపించింది. ఏం జరిగిందని వచ్చిన వ్యక్తి అడగ్గా 'నా వైపు చూస్తూ ఆపకుండా అదే పనిగా నవ్వింది. అందుకే కోపంతో కొట్టాను' అని కెన్నెత్ చెప్పాడు. దీంతో ఘటన స్థలికి చేరుకున్న ఎఫ్‌బీఐ అధికారులు అతడిని అరెస్టు చేశారు. కోర్టు బెయిలిచ్చేందుకు నిరాకరిస్తూ కేసు విచారణ ఆగస్టు 10న చేస్తామని తెలిపింది.