దిశ మార్చుకున్న ఇర్మా.. ముప్పు తప్పినట్లేనా? | Sakshi
Sakshi News home page

దిశ మార్చుకున్న ఇర్మా.. ముప్పు తప్పినట్లేనా?

Published Mon, Sep 11 2017 9:45 AM

దిశ మార్చుకున్న ఇర్మా.. ముప్పు తప్పినట్లేనా? - Sakshi

సాక్షి, న్యూయార్క్‌:  హరికేన్‌ ఇర్మా కాస్త శాంతించినట్లే కనిపిస్తోంది. ఆదివారం సాయంత్రం ఫ్లోరిడా రాష్ట్రాన్ని బలంగా తాకిన తుఫాన్‌ ముందు నైరుతి ఫ్లోరిడా వైపు కదిలినట్లు కనిపించింది. అయితే ప్రస్తుతం తంప వద్ద కేంద్రీకృతమైన ఇర్మా  దిశమార్చుకుని పశ్చిమ తీరం దిశగా మళ్లినట్లు సమాచారం. దీంతో పెనుముప్పు తప్పినట్లేనని అధికారులు భావిస్తున్నారు.
 
 
ప్రచండ గాలుల వేగం నిన్న సుమారు గంటకు 135 మైళ్ల వేగం కాగా, నేడు అది 105 మైళ్లకు తగ్గింది. దీంతో ప్రమాద హెచ్చరికను కేటగిరి-4 నుంచి కేటగిరీ-2కి తగ్గించారు. అయితే తీర ప్రాంతాల్లో మాత్రం ఈ ప్రభావం అధికంగా ఉండబోతుందని అమెరికా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మరోవైపు 10-15 అడుగుల ఎత్తు అలలు ఎగిసిపడుతుండటంతో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ఫ్లోరిడా, జార్జియా, కరోలినస్‌ రాష్ట్రాలకు భారీ నష్టం తప్పదనే అనిపిస్తోంది. అయితే తాము నష్టం గురించి పట్టించుకోవట్లేదని... ప్రజల ప్రాణాల గురించే తాము ఆలోచిస్తున్నామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తెలిపారు. 
 
 
పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న ట్రంప్‌ తుఫాన్‌ ఉధృతి తగ్గుముఖం పట్టినా మరికొన్ని గంటలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటూ అధికారులకు సూచించారు. తుఫాన్‌ దాటికి ఇప్పటిదాకా ఫ్లోరిడాలో నలుగురు మృతి చెందినట్లు సమాచారం. విద్యుత్‌ సేవలకు అంతరాయం కలగటంతో 3 మిలియన్ల మంది గాడాంధకారంలో చిక్కుకుపోయినట్లు అధికారులు చెబుతున్నారు. లక్ష పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ ప్రజలు మాత్రం ఇళ్లకే పరిమితమవుతున్నారు.
 
 
 
 
 
 
 
 

Advertisement
Advertisement