ఉగ్రవాద పైశాచికానికిది పరాకాష్ట | Horrific moment ISIS throw a man off the top of a building with his hands and feet tied after he is accused being gay | Sakshi
Sakshi News home page

ఉగ్రవాద పైశాచికానికిది పరాకాష్ట

Jan 17 2016 7:53 PM | Updated on Jul 30 2018 8:29 PM

ఉగ్రవాద పైశాచికానికిది పరాకాష్ట - Sakshi

ఉగ్రవాద పైశాచికానికిది పరాకాష్ట

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల పైశాచికత్వానికి ఇదొక పరాకాష్ట. చూడగానే గుండెలు ఆగిపోయేలా చేసేంత భయంకరమైన దృశ్యం.. ఆఖరికి కిల్లర్ సినిమాల్లో కూడా కనిపించని దృశ్యాన్ని ఐఎస్ఐఎస్ విడుదల చేసింది.

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల పైశాచికత్వానికి ఇదొక పరాకాష్ట. చూడగానే గుండెలు ఆగిపోయేలా చేసేంత భయంకరమైన దృశ్యం.. ఆఖరికి కిల్లర్ సినిమాల్లో కూడా కనిపించని దృశ్యాన్ని ఐఎస్ఐఎస్ విడుదల చేసింది. ఓ వ్యక్తి స్వలింగ సంపర్కుడిగా ఉన్నాడని అతడిని బంధించి, బాగా కొట్టి, చేతులను వెనక్కి కట్టి, కాళ్లను కూడా తాడుతో కట్టేసి ముఖానికి ముసుగు వేసి ఓ బిల్డింగ్ పైకి తీసుకెళ్లి కిందపడేసి చంపేశారు. ఐఎస్ 'లా' ప్రకారం ఓ వ్యక్తి స్వలింగ సంపర్కుడిగా ఉండటం, ఆ విధానానికి మద్దతు తెలపడం నేరం.

ఈ కారణంతోనే ఆ వ్యక్తిని బంధించి అతడికి మరణ శిక్షను అమలుచేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఎలాంటి శిక్ష అమలుచేస్తున్నారా అని గుంపులుగుంపులుగా జనం ఆ భవనం వైపు చూస్తుండగా వారి పక్కనే ఉగ్రవాదులు తుపాకులతో ఉండగా ముసుగేసి తాళ్లతో బంధించి ఉన్న ఆ వ్యక్తిని నేరుగా కిందపడేశారు. దీంతో అతడు తలపగిలి చనిపోయాడు. ఆ వ్యక్తి ఆ భవనంపై నుంచి కిందపడిపోతున్నప్పటి నుంచి నేలను తాకి చనిపోయేంతవరకు ఫొటోల్లో బంధించి వాటిని ఉగ్రవాదులు విడుదల చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement