అతనికి విమానం కూలుతుందని ముందే తెలుసా? | His last Facebook post proves prophetic | Sakshi
Sakshi News home page

అతనికి విమానం కూలుతుందని ముందే తెలుసా?

Jul 18 2014 3:01 PM | Updated on Sep 2 2017 10:29 AM

అతనికి విమానం కూలుతుందని ముందే తెలుసా?

అతనికి విమానం కూలుతుందని ముందే తెలుసా?

విమానం ఎక్కే ముందు ఆ ప్రయాణికుడు ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ పెట్టాడు. "విమానానికి ఏదైనా అయితే ఇదిగో నేనెక్కిన విమానం ఇలా ఉంటుంది" అంటూ పోస్టు చేశాడు అతను.

విమానం ఎక్కే ముందు ఆ ప్రయాణికుడు ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ పెట్టాడు. "విమానానికి ఏదైనా అయితే ఇదిగో నేనెక్కిన విమానం ఇలా ఉంటుంది" అంటూ పోస్టు చేశాడు అతను. కొద్ది గంటల తరువాతే అతను ప్రయాణిస్తున్న విమానం ఉక్రేన్ గగనతలం నుంచి భూతలానికి నిప్పురవ్వలా రాలిపోయింది. దాంతో అతని ప్రాణాలు కూడా అనంతవాయువుల్లో కలిసిపోయాయి. 
 
కోర్ పాన్ అనే డచ్ ప్రయాణికుడు ఉక్రేన్ లో కుప్పకూలిన విమానంలో ప్రయాణించి, కౌలాలంపూర్ కి బయలుదేరాడు. విమానం ఎక్కడానికి క్షణాల ముందు విమానం ఫోటో తీసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. హిందూ మహాసముద్రంలో కుప్పకూలిన ఎం హెచ్ 370 గుర్తుకొచ్చిందేమో, కాస్త సరదాగా ఓ కామెంట్ కూడా పెట్టాడు. 
 
దానికి మిత్రుల నుంచి కామెంట్లు కూడా వచ్చాయి. ఆ తరువాత కాస్సేపటికే ప్రమాదం జరగడంతో మిత్రుల కామెంట్లు వేళాకోళం నుంచి విషాదానికి మారాయి. కోర్ పాన్ తో పాటు అతని గర్ల్ ఫ్రెండ్ నీల్ ట్యే తోలా కూడా అదే విమానంలో ఉంది. కలసి చేసిన ప్రయాణమే వారి ఆఖరి ప్రయాణంగా మారింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement