పాకిస్తాన్‌లో మరో దురాగతం

Hindu Girl Abducted And Converted To Islam In Pakistan - Sakshi

హిందు యువతి బలవంత మత మార్పిడి

వివాహం చేసుకున్న ముస్లిం యువకుడు

ఇస్లామాబాద్‌: దాయాది దేశం పాకిస్తాన్‌లో మరో దురాగతం చోటుచేసుకుంది. మైనార్టీ వర్గమైన సిక్కు పూజారి కుమార్తెను ముస్లిం యువకుడు బలవంతంగా వివాహం చేసుకున్న ఘటన మరువక ముందే మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. సింధు ప్రావిన్స్‌లో ఓ హిందూ యువతిని  బలవంతంగా మత మార్పిండి చేయించి ఓ ముస్లిం యువకుడు వివాహం చేసుకున్నాడు. యువతి తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. బీబీఏ చదువుతున్న తన కుమార్తె ఆగస్ట్‌ 29న ఇంటినుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదన్నారు. అయితే సదరు యువతిని తన క్లాస్‌మెట్స్‌ బాబార్‌ అమర్‌, మీర్జా దిల్వార్‌ కలిసి అపహరించుకుపోయారని, ఆ తరువాత మత మార్పిడి చేయించి అమర్‌ వివాహం చేసుకున్నారని స్థానిక మీడియాలో వార్తలు వచ్చినట్ల తెలిపారు.

దీనిపై యువతి తండ్రి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిద్దరినీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం ఆ యువతి మాట్లాడుతూ... అమర్‌, మీర్జా తనను కిడ్నాప్‌ చేశారని, అనంతరం ఇస్లాం మతంలోకి మార్పించి బలవంతంగా పెళ్లి చేకున్నాడని తెలిపింది. ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తామని స్థానిక పోలీసులు తెలిపారు. అయితే మీర్జా దిల్వార్‌ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ సారథ్యంలోని పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ) సభ్యురాలిగా తెలింది. కాగా గడిచిన వారం రోజుల్లోనే  ఇలాంటి ఘటనలు రెండు జరగడం గమన్హారం. యువతలను ఎత్తుకెళ్లి మతం మార్చి ముస్లిం యువకులకు ఇచ్చి పెళ్లి చేయడం లాంటి ఘటనలు పాక్‌లో ఇటీవల బాగా పెరిగాయి. తాజా ఘటన వారంలో రెండోది కాగా, రెండు నెలల్లో ఇది మూడోదని పాకిస్తాన్‌కు చెందిన హిందూ ఎన్జీవో ఆల్ పాకిస్తాన్ హిందూ పంచాయత్‌ తెలిపింది.

చదవండి: పాక్‌లో సిక్కు యువతి మత మార్పిడి!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top