ఒహయో, ఫ్లోరిడాలే కీలకం | Hillary, Trump whirlwind campaign | Sakshi
Sakshi News home page

ఒహయో, ఫ్లోరిడాలే కీలకం

Nov 3 2016 2:59 AM | Updated on Aug 25 2018 7:50 PM

ఒహయో, ఫ్లోరిడాలే కీలకం - Sakshi

ఒహయో, ఫ్లోరిడాలే కీలకం

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు వారం రోజులే గడువు ఉండడంతో ప్రధాన ప్రత్యర్థులు హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్‌లు ప్రకటనలతో హోరెత్తిస్తున్నారు.

హిల్లరీ, ట్రంప్ సుడిగాలి ప్రచారం
 
 వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు వారం రోజులే గడువు ఉండడంతో ప్రధాన ప్రత్యర్థులు హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్‌లు ప్రకటనలతో హోరెత్తిస్తున్నారు. పోటీ హోరాహోరీగా ఉన్న కీలక రాష్ట్రాల్లో వందల కోట్లు ప్రకటనలపై ఖర్చుచేస్తున్నారు. హిల్లరీ ఈ-మెయిల్ వివాదాన్ని ఎఫ్‌బీఐ తిరగదోడిన నేపథ్యంలో ఒపీనియన్ పోల్స్ తారుమారయ్యాయి.  పలు జాతీయ సర్వేల్లో హిల్లరీ, ట్రంప్‌ల మధ్య పోటీ నువ్వా - నేనా అన్నట్లు ఉంది. ఒహయో, ఫ్లోరిడా రాష్ట్రాలు కీలకం కావడంతో హిల్లరీ, ట్రంప్, దేశాధ్యక్షుడు ఒబామాలు చివరి వారం ఈ రాష్ట్రాలపై దృష్టిపెడుతున్నారు.

మంగళవారం హిల్లరీ ఫ్లోరిడా రాష్ట్రంలో 3 ర్యాలీల్లో ప్రసంగించగా... ఒబామా ఒహయోలో ప్రచారం చేశారు. ట్రంప్ వచ్చే రెండు రోజుల్లో ఫ్లోరిడాలో సుడిగాలి ప్రచారం చేస్తా రు. చివరి వారంలోనే ఇరు ప్రచార శిబిరాలు, వారికి మద్దతిస్తున్న  గ్రూపులు దాదాపు రూ. 285 కోట్లు ఖర్చుపెట్టనున్నట్లు అంచనా. కాగా, నవంబర్ 8 ఎన్నిక కోసం ఇప్పటికే  2.8 కోట్ల మంది ఓటేశారు. మరోవైపు.. హిల్లరీకి మరో చిక్కు వచ్చిపడింది. ఆమె భర్త బిల్ క్లింటన్ దేశాధ్యక్షుడిగా ఉన్నప్పుడు బెల్జియం వ్యాపారి మార్క్‌రిచ్‌కు క్షమాభిక్ష పెట్టిన కేసులో 2001 నాటి విచారణ నివేదిక ఎఫ్‌బీఐ ట్విటర్ ఖా తాలో దర్శనమిచ్చింది.విచారణ 2005లోనే ముగించిన ఎఫ్‌బీఐ బిల్ క్లింటన్‌పై ఏ కేసూ నమోదు చేయలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement