హెచ్‌1బీతో అమెరికన్లకు నష్టం లేదు!

H-1Bs lead to faster earnings growth for US workers - Sakshi

వాషింగ్టన్‌: హెచ్‌–1బీ వీసాల వల్ల అమెరికన్లకు జరిగే నష్టం లేదని తాజా పరిశోధన ఒకటి స్పష్టం చేసింది. ఈ రకమైన వీసాలున్న విదేశీ ఉద్యోగులు ఉండటం ఉపాధి అవకాశాలను పెంచుతాయని పరిశోధన తెలిపింది. అమెరికా కంపెనీలు విదేశీ ఉద్యోగులతో పని చేయించుకునేందుకు హెచ్‌–1బీ వీసాలు వీలు కల్పిస్తాయన్నది తెలిసిందే. విదేశీ ఉద్యోగులు.. అమెరికన్ల ఉద్యోగ అవకాశాలను దెబ్బతీస్తున్నారని ట్రంప్‌ ప్రభుత్వం భావిస్తూండగా.. ఇందుకు హేతువు లేదని పరిశోధన చెబుతోంది. హెచ్‌1బీ వీసాదారుల వల్ల నిరుద్యోగ సమస్య తక్కువగా ఉంటున్నట్లు తెలుస్తోందని ఈ పరిశోధనను నిర్వహించిన నేషనల్‌ ఫౌండేషన్‌ ఫర్‌ అమెరికన్‌ పాలసీ తెలిపింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top