కరోనా: ‘స్వీడన్‌లో ఆ వెసులుబాటు లేదు’

Greta Thunberg Says It Is Extremely Likely She Have Coronavirus Self Isolation - Sakshi

పర్యావరణ ఉద్యమకర్త గ్రెటా థంబర్గ్‌

స్టాక్‌హోం: కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) వ్యాప్తి నేపథ్యంలో తాను స్వీయ నిర్బంధంలో ఉన్నానని స్వీడిష్‌ యువకెరటం, పర్యావరణ వేత్త గ్రెటా థంబర్గ్‌  తెలిపారు. వాతావరణ మార్పుపై అవిశ్రాంతంగా ఉద్యమిస్తున్న గ్రెటా.. వివిధ దేశాల్లో పర్యటిస్తారన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ఇటీవల మధ్య యూరప్‌లో పర్యటించారు. ఈ క్రమంలో తనకు కరోనా సోకినట్లు అనుమానం వ్యక్తం చేశారు. అంతేగాకుండా తనతో పాటు ప్రయాణించిన తన తండ్రిలో వైరస్‌ లక్షణాలు వృద్ధి చెందుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. యువతలో కరోనా లక్షణాలు అంత త్వరగా బయటపడవని.. కాబట్టి వారు మరింత బాధ్యతాయుతంగా ప్రవర్తించి మహమ్మారి వ్యాప్తిని అరికట్టాలని విజ్ఞప్తి చేశారు. ఎదుటివారిని ప్రమాదంలో పడేయవద్దని సూచించారు.
(చదవండి: కరోనా వైరస్‌: ఎందుకంత ప్రమాదకారి?)

ఆ వెసులుబాటు లేదు
‘‘గత రెండు వారాలుగా నేను ఇంట్లోనే ఉన్నాను. మధ్య యూరప్‌లో పర్యటించిన తర్వాత స్వీయ నిర్బంధంలోకి వెళ్లాను. నాతో పాటు నాన్న కూడా ప్రయాణించారు. మేమిద్దరం అమ్మా, సోదరికి దూరంగా వేరే అపార్టుమెంటు తీసుకుని బస చేస్తున్నాం. పది రోజుల క్రితం నాలో కరోనా లక్షణాలు బయటపడ్డాయి. గొంతు నొప్పి వస్తోంది. జలుబు చేసింది. అయితే నాన్న పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉంది. తీవ్రమైన జ్వరంతో ఆయన  బాధపడుతున్నారు. అత్యవసర పరిస్థితి ఏర్పడేంత వరకు స్వయంగా కోవిడ్‌-19 పరీక్షలు నిర్వహించుకునే వెసులుబాటు స్వీడన్‌లో లేదు. చాలా మంది తమకు అనారోగ్యంగా ఉందని చెబుతున్నారు. ఇంట్లోనే ఉంటున్నారు. నేనింత వరకు కరోనా పరీక్ష చేయించుకోలేదు. కానీ నాలో లక్షణాలు కనిపిస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే నేను ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ప్రతీ ఒక్కరూ ఇంట్లోనే ఉండండి. మీ కారణంగా ఎవరికీ ఇబ్బంది రానీయకండి’’అని గ్రెటా తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులో రాసుకొచ్చింది.
(ఆన్‌లైన్‌లో సరుకులు ఆర్డర్ చేశారా?)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

06-04-2020
Apr 06, 2020, 08:22 IST
సాక్షి, గుంటూరు: జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు  పెరుగుతున్న నేపథ్యంలో అధికారు లు ఆంక్షలను కఠినతరం చేస్తున్నారు. అడుగడుగునా నిబంధనలు...
06-04-2020
Apr 06, 2020, 08:07 IST
కనిపించే దేవుళ్లు వైద్యులు అంటారు. అది ముమ్మాటికీ నిజమని ప్రస్తుత పరిస్థితిలో అంగీకరించకతప్పదు. కరోనా మహమ్మారిని జయించే క్రమంలో కేంద్ర,...
06-04-2020
Apr 06, 2020, 08:06 IST
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో కరోనా వైరస్‌ కోరలు చాస్తోంది. ఈ మహమ్మారి విజృంభిస్తున్న కేసులు నిత్యం వెలుగులోకి వస్తుండటంతో...
06-04-2020
Apr 06, 2020, 07:48 IST
సాక్షి, అనంతపురం: జిల్లాలో కొత్తగా మరో మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య...
06-04-2020
Apr 06, 2020, 07:04 IST
సాక్షి, కంబాలచెరువు (రాజమహేంద్రవరం): పొద్దున్న లేచింది మొదలు అర్ధరాత్రి వరకూ స్కూళ్లు, కాలేజీలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ప్రయాణాలు.. ఇలా అనేక కార్యకలాపాల్లో నిత్యం...
06-04-2020
Apr 06, 2020, 07:01 IST
మైసూరు: పెళ్ళి అనగానే ఎంత ఎక్కువమంది అతిథులు తరలివస్తే అంత ఆడంబరంగా జరిగినట్లు లెక్క. కానీ ప్రస్తుతం కరొనా వైరస్‌...
06-04-2020
Apr 06, 2020, 04:36 IST
కరోనా వైరస్‌ ప్రపంచాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసింది. దేశాలన్నీ ఇప్పుడు ఈ వైరస్‌ నియంత్రణ కోసమే తమ శక్తియుక్తులన్నింటినీ వెచ్చిస్తున్నాయి....
06-04-2020
Apr 06, 2020, 04:16 IST
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా 505 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని,...
06-04-2020
Apr 06, 2020, 04:12 IST
న్యూజిలాండ్‌ పర్యటనలో గాయపడిన భారత స్టార్‌ బ్యాట్స్‌మన్‌ రోహిత్‌ శర్మ ఇటీవలే కోలుకున్నాడు. కివీస్‌తో వన్డే, టెస్టు సిరీస్‌లకు దూరమైన...
06-04-2020
Apr 06, 2020, 04:03 IST
వాషింగ్టన్‌/బీజింగ్‌/మాడ్రిడ్‌: ‘‘మా అమ్మ వయసు 85 సంవత్సరాలు. కరోనా వ్యాధి సోకి ఊపిరి పీల్చుకోలేని దుస్థితి. ఆస్పత్రికి తీసుకువెళితే మత్తు...
06-04-2020
Apr 06, 2020, 03:52 IST
సాక్షి నెట్‌వర్క్‌: కరోనా కారణంగా నిన్న మొన్నటి వరకు పూర్తిగా పడిపోయిన చికెన్‌ అమ్మకాలు.. దానివల్ల వైరస్‌ సోకదని నిపుణులు తేల్చిచెప్పడంతో...
06-04-2020
Apr 06, 2020, 03:50 IST
నేరడిగొండ: ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండలో కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో మథుర కాలనీవాసులు ఆదివారం ఉదయం వ్యవసాయ క్షేత్రాల బాట...
06-04-2020
Apr 06, 2020, 03:43 IST
సాక్షి, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ కారణంగా రా ష్ట్రంలో నేరాలు గణనీయంగా తగ్గాయి. సాధారణ రోజుల కంటే కాస్త అటూ ఇటుగా...
06-04-2020
Apr 06, 2020, 03:28 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రమంతా ఇప్పుడు కరోనా గుప్పిట ‘బందీ’ అయిపోయింది. యావత్తు తెలంగాణ సమాజం వైరస్‌ తమను కబళిస్తుందేమోననే భయంతో...
06-04-2020
Apr 06, 2020, 03:15 IST
సాక్షి, అమరావతి, సాక్షి నెట్‌వర్క్‌: లాక్‌డౌన్‌ కారణంగా కాలు బయట పెట్టలేక అనారోగ్యంతో బాధపడుతున్న వారికి టెలీ మెడిసిన్‌ సేవలు...
06-04-2020
Apr 06, 2020, 03:07 IST
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైన నేపథ్యంలో రెడ్‌ జోన్‌గా ప్రకటించిన ప్రాంతంలో  ఆశా వర్కర్లతో కలసి...
06-04-2020
Apr 06, 2020, 03:03 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను మరింత పటిష్టంగా అమలు చేయాలని కేంద్రం సూచించింది. కొన్నిచోట్ల లాక్‌డౌన్‌ సరిగా అమలు కావడంలేదని,...
06-04-2020
Apr 06, 2020, 02:53 IST
సాక్షి, అమరావతి/లబ్బీపేట (విజయవాడ): కరోనా కేసులతో ఆదివారం ఒక్కసారిగా కర్నూలు జిల్లా ఉలిక్కిపడింది. ఒక్కరోజే ఇక్కడ 49 కేసులు నమోదు...
06-04-2020
Apr 06, 2020, 02:46 IST
సాక్షి, అమరావతి: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఫోన్‌ చేశారు. కోవిడ్‌–19 నియంత్రణ చర్యలపై...
06-04-2020
Apr 06, 2020, 02:39 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top