ఆన్‌లైన్‌లో సరుకులు ఆర్డర్ చేశారా?

As Lockdown Impedes Online Grocery Deliveries Suspends - Sakshi

సాక్షి, ముంబై: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశం మొత్తం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. దీంతో ప్రముఖ  ఈ కామర్స్ సంస్థలు తమ సేవలను తాత్కాలికంగా నిలిపివేశాయి. ముఖ్యంగా బిగ్‌బాస్కెట్ , గ్రోఫర్స్ లాంటి ఆన్ లైన్  గ్రాసరీస్ (కిరణా) సేవల సంస్థలు కూడా తమ డెలివరీలను తాత్కాలికంగా రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీటితో పాటు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లాంటివి ఈ కోవలో ఉన్నాయి. దీంతో ఆన్ లైన్ కొనుగోళ్ల పై ఆధారపడిన వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది.
(చదవండి: అమ్మను సర్‌ప్రైజ్‌ చేస్తానని.. అనంత లోకాలకు)

‘ప్రస్తుతానికి సేవలను నిలిపివేశాం..కేంద్ర అధికారుల స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నప్పటికీ, స్థానిక అధికారుల ఆంక్షల కారణంగా సేవలు తాత్కాలికంగా అందుబాటులో లేవు. త్వరలోనే పునరుద్దిస్తాం’ అనే సందేశం దేశవ్యాప్తంగా చాలామంది బిగ్‌బాస్కెట్ వినియోగదారులకు దర్శనమిస్తోంది. అంతేకాదు ఆర్డర్ రద్దు చేశామని తెలియజేయడానికి చింతిస్తున్నామనే సందేశం  కూడా  కొంతమంది వినియోగదారులను వెక్కిరిస్తోంది. ప్రభుత్వం అత్యవసర సేవలుగా ప్రకటించినప్పటికీ డెలివరీలను తాత్కాలికంగా ఆపాల్సిన పరిస్థితి ఏర్పడిందని  బిగ్‌బాస్కెట్ వెల్లడించింది. ఈ సమస్య పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో చర్చిస్తున్నామని తెలిపింది.
(చదవండి: కరోనా వైరస్‌: ఎందుకంత ప్రమాదకారి?)

అంతేకాదు డెలివరీ ఎగ్జిక్యూటివ్ లు వేధింపులకు గురి కావల్సి వస్తోందని వాపోయింది. తమ డెలివరీ బాయ్స్‌ని  పోలీసులు ఆపి ప్రశ్నించడంతోపాటు, కొన్ని సందర్భాల్లో దాడి చేసినట్టు కూడా ఆరోపించింది.  దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.  అలాగే తాత్కాలికంగా ఆర్డర్లు తీసుకోవడం ఆపేసి, అవసరమైన వస్తువుల పంపిణీపై మాత్రమే దృష్టి పెట్టామని అమెజాన్ ఇండియా ప్రకటించింది. తక్కువ ప్రాధాన్యత కలిగిన ఉత్పత్తుల రవాణాను నిలిపివేసినట్టు వెల్లడించింది. లాక్ డౌన్ కారణంగా తమ సేవలను తాత్కాలికంగా రద్దు చేశామని మరో సంస్థ ఫ్లిప్ కార్ట్ తెలిపింది. అయితే ఈ సంస్థల సేవలు తిరిగి ఎపుడు అందుబాటులోకి వచ్చేది  స్పష్టత లేదు.

మరోవైపు తాజా పరిమాణాలపై స్పందించిన ఒక  నెటిజన్  తెలంగాణా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కి ట్వీట్ చేశారు. వెంటనే స్పందించిన కేటీఆర్ ఐటీశాఖ కార్యదర్శి జయేశ్ రంజన్‌ను తగిన ఆదేశాలిచ్చినట్టు తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో  పరిస్థితి చక్కబడుతుందే కేటీఆర్ ఆశిస్తూ ట్వీట్ చేశారు. కాగా  కోవిడ్ -19 ను నిరోధించే చర్యల్లో భాగంగా ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ 21 రోజుల దేశ వ్యాప్త లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంటికే పరిమితం  కావాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీంతో నిత్యాసరాలకోసం ప్రజలు అనేక ఇబ్బందుల పాలవుతున్నారు. ఆన్‌లైన్ సైట్ల ద్వారానే ఆహార పదార్థాలు, నిత్యావసరాలు, మందులు అన్నీ కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

25-10-2020
Oct 25, 2020, 10:20 IST
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో గడిచిన 24 గంటల్లో 50,129 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల...
25-10-2020
Oct 25, 2020, 04:57 IST
గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ కరోనా బారినపడ్డారు. కొన్ని రోజులుగా గ్రామాల్లో పర్యటనలు, తర్వాత శ్రీవారి...
24-10-2020
Oct 24, 2020, 17:22 IST
సాక్షి, అమరావతి : ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది.  రాష్ట్రంలో...
24-10-2020
Oct 24, 2020, 14:58 IST
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో  కరోనా మహమ్మారి  బారిన పడుతున్న రాజకీయ నాయకులు సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి,...
24-10-2020
Oct 24, 2020, 12:14 IST
కరోనా వ్యాక్సిన్‌పై ఎందుకు రాజకీయాలు చేస్తారు..?. టీకాపై ఒక్క బిహార్‌కే కాదు దేశం మొత్తానికి సమాన హక్కులు ఉన్నాయి.
24-10-2020
Oct 24, 2020, 10:46 IST
సమాచారం అందుకున్న పోలీసులు కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఆ బట్టల దుకాణాన్ని సీజ్‌ చేశారు.
24-10-2020
Oct 24, 2020, 09:54 IST
దేశంలో కరోనా రోగులకు ప్లాస్మా థెరపీ చికిత్స ద్వారా పెద్దగా ఫలితం లేదని బ్రిటీష్‌ మెడికల్‌ జర్నల్‌ తెలిపింది.
24-10-2020
Oct 24, 2020, 07:32 IST
సా​‍క్షి, హిమాయత్‌ నగర్‌:  మన ఒంటి శుభ్రమే కాదు. చేతుల శుభ్రం కూడా చాలా ముఖ్యం. రోజూ మనం ఎంతోమందిని...
24-10-2020
Oct 24, 2020, 06:09 IST
ఏడాది చివర్లోగా వ్యాక్సిన్‌ మార్కెట్‌లో విడుదల అవతుందని ఆశిస్తున్నామన్నారు. ఆశుభ ఘడియ రాగానే ప్రభుత్వమే పూర్తి ఖర్చును భరించి రాష్ట్ర...
24-10-2020
Oct 24, 2020, 04:36 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఒకేరోజు రికార్డు స్థాయిలో 80,238 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. కరోనా వచ్చినప్పట్నుంచి ఇదే ఆల్‌టైమ్‌...
23-10-2020
Oct 23, 2020, 19:35 IST
సాక్షి, అమరావతి :  ఏపీలో గడిచిన 24 గంటల్లో 80,238 కరోనా సాంపిల్స్‌ పరీక్షలు నిర్వహించగా.. 3,765 మందికి కోవిడ్‌ పాజిటివ్‌గా...
23-10-2020
Oct 23, 2020, 15:28 IST
బెంగళూరు: కరోనా మహమ్మారి గురించి రోజుకొక షాకింగ్‌ న్యూస్‌ వెలుగులోకి వస్తోంది. తాజాగా ఇలాంటి వార్త మరొకటి తెలిసింది. కరోనాతో...
23-10-2020
Oct 23, 2020, 14:27 IST
కోవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఈ నవంబర్‌లో నిర్వహించే పరిస్థితి లేదని మంత్రి గౌతమ్‌రెడ్డి‌ అన్నారు.
23-10-2020
Oct 23, 2020, 11:01 IST
కరోనా వ్యాక్సిన్ తయారీలో దేశీయ సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) భారీ సన్నాహాలు ప్రారంభించింది. 
23-10-2020
Oct 23, 2020, 10:20 IST
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో గడిచిన 24 గంటల్లో 54,366 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల...
23-10-2020
Oct 23, 2020, 09:35 IST
సాక్షి, ముంబై: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న వేళ ప్రపంచంలోనే అతిపెద్ద టీకా తయారీ సంస్థ...
22-10-2020
Oct 22, 2020, 18:41 IST
సాక్షి,అమరావతి : ఏపీలో కరోనా పరీక్షలు రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ గురువారం విడుదల చేసిన హెల్త్‌...
22-10-2020
Oct 22, 2020, 18:37 IST
సాక్షి, హైదరాబాద్‌ : ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్‌ విరుగుడును కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు రేయింబవళ్లు కష్టపడుతున్నారు. వ్యాక్సిన్‌ తయారీ కోసం...
22-10-2020
Oct 22, 2020, 17:50 IST
క‌మెడియ‌న్, న‌టుడు సుడిగాలి సుధీర్‌కు క‌రోనా సోకిందంటూ గ‌త కొంత కాలంగా వార్త‌లు షికార్లు చేస్తున్నాయి. దీనిపై సుధీర్ ఎలాంటి...
22-10-2020
Oct 22, 2020, 17:27 IST
కరోనా వైరస్‌ బారిన పడిన 28 ఏళ్ల బ్రెజీలియన్‌ యువ డాక్టర్‌ మరణంపై ప్రపంచ వ్యాప్తంగా రాద్ధాంతం చెలరేగుతోంది.
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top