మేకప్‌తో మంచి మార్కులు! | Good marks with makeup | Sakshi
Sakshi News home page

మేకప్‌తో మంచి మార్కులు!

Jul 31 2017 2:14 AM | Updated on Sep 5 2017 5:13 PM

మేకప్‌తో మంచి మార్కులు!

మేకప్‌తో మంచి మార్కులు!

మేకప్‌ వేసుకోవటం వల్ల మహిళల్లో ఆత్మస్థైర్యం పెరిగి చదువులో మంచి మార్కులు సాధిస్తారని ఇటీవల జరిగిన పరిశోధనలో వెల్లడైంది.

న్యూయార్క్‌: మేకప్‌ వేసుకోవటం వల్ల మహిళల్లో ఆత్మస్థైర్యం పెరిగి చదువులో మంచి మార్కులు సాధిస్తారని ఇటీవల జరిగిన పరిశోధనలో వెల్లడైంది. అమెరికాలోని వివిధ యూనివర్సిటీలకు చెందిన శాస్త్రవేత్తలు అకడమిక్‌ పెర్ఫామెన్స్‌ పై మేకప్‌ ప్రభావం ఏ మేరకు ఉంటుందన్న విషయంపై పరిశోధనలు నిర్వహించారు. శాస్త్రవేత్తలు ముందుగా మహిళలను మూడు గ్రూపులుగా విభజించి.. ఒక గ్రూపు వారికి మేకప్‌ను వేయగా, రెండవ గ్రూప్‌ వారికి సంగీతం వినిపించారు. ఇక మూడో వారికి మొహంపై రంగులు అద్దారు.

అనంతరం మూడు గ్రూపులకు చెందిన మహిళలకు జనరల్‌ సైకాలజీలో పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో మేకప్‌ వేసుకున్న మహిళలు మంచి మార్కులు తెచ్చుకున్నారు. ఆ తర్వాతి స్థానంలో సంగీతం విన్నవారు నిలిచారు. మేకప్‌ వేసుకోవటం వల్ల తాము అందంగా ఉన్నామన్న భావన పెరిగి, వ్యక్తిత్వం మీద ప్రభావం చూపుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ విషయాన్ని కోజెంట్‌ సైకాలజీ అనే జర్నల్‌ ప్రచురించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement