వాట్‌ యాన్‌ ఐడియా.. వెరీ గుడ్‌ : ట్రంప్‌ | Good Idea : President Donald Trump | Sakshi
Sakshi News home page

పాక్‌కు ఇచ్చే డబ్బుతో మన రోడ్లేయ్యండి : ట్రంప్‌

Jan 6 2018 8:10 PM | Updated on Aug 25 2018 7:52 PM

Good Idea : President Donald Trump - Sakshi

వాషింగ్టన్‌ : 'చాలా మంచి ఆలోచన.. ఈ బిల్లు తీసుకొచ్చినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను' అని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఓ అమెరికన్‌ సెనేటర్‌పై ప్రశంసలు గుప్పించారు. ఆ సెనేటర్‌ చేసిన ఆలోచనకు ముగ్దుడైపోయారు అది ఎందుకనుకుంటున్నారా.. పాకిస్థాన్‌కు సంబంధించిన విషయంపైనే.. అవునూ.. రిపబ్లికన్‌ పార్టీ సెనేటర్‌ ర్యాండ్‌ పౌల్‌ ఓ బిల్లును తెరపైకి తెచ్చారు. అందులో పాక్‌కు నిధులు నిలిపివేసే అంశమే ఉంది. ఇది చూసిన ట్రంప్‌ వెంటనే ఆయనకు ఓ వీడియోతో సహా ప్రశంసలతో కూడిన ట్వీట్‌ చేశారు.

'మంచి ఆలోచన ర్యాండ్‌. ఉగ్రవాదంపై పాక్‌ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేనందున ఈ నిధులు ఆపేయాలంటూ తెచ్చిన బిల్లు బావుంది. మన దేశంలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి పరిచేందుకు ఆ డబ్బు వినియోగిద్దామన్న ఆలోచన మంచిది' అని ట్రంప్‌ చెప్పారు. పాక్‌ ఉగ్రవాదాన్ని తుదముట్టించని కారణంగా ప్రతి ఏటా అమెరికా చేస్తున్న ఆర్థిక సాయం నిరర్ధకమవుతోందని, ఈ ఏడాది ఆ డబ్బును పంపిచడం ఆపేసి దాంతో దేశంలో రహదారులు, వంతెనలువంటి మౌలిక సదుపాయాలకు ఉపయోగించుదామని సెనేటర్‌ ర్యాండ్‌ బిల్లును తెచ్చారు. దాదాపు రెండు బిలియన్‌ డాలర్ల సాయాన్ని అమెరికా ఆపేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement