పారిస్ రైల్లో ఆగంతకుడు కాల్పులు | Sakshi
Sakshi News home page

పారిస్ రైల్లో ఆగంతకుడు కాల్పులు

Published Sat, Aug 22 2015 2:47 PM

Give Me Back My Gun,' Paris Train Attacker Pleaded With Americans

పారిస్ :  పారిస్లో ఓ రైల్లో దుండగుడు జరిపిన కాల్పులను ఓ అమెరికన్ ప్రయాణికుడు ధైర్యంగా ఎదుర్కొన్నాడు.  ఆమ్స్టార్ డామ్ నుంచి పారిస్ వెళుతున్న రైలులోకి ఓ ఆగంతకుడు ప్రవేశించాడు.  రావడంతోనే అతగాడు తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. ఈ సంఘటనలో ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన తోటి ప్రయాణికులు, దుండగుడిపై దాడి చేశారు. ఓ ప్రయాణికుడు అతడిని వద్ద నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.

కాగా గాయపడినవారిలో ఇద్దరు అమెరికన్ మిలటరీకి చెందినవారు కాగా,  దుండగుడు మొరాకోకు చెందినవాడిగా గుర్తించారు. కాగా ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి రైల్లో ప్రయాణికులు దిగ్ర్భాంతికి గురయ్యారు. హఠాత్తుగా కాల్పుల మోత వినిపించిందని, ఏం జరుగుతుందో అర్థం కాలేదని, ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపాడని, ఆ కాల్పుల్లో అద్దం పగిలిందని ఓ ప్రయాణికుడు తెలిపాడు.

 

Advertisement
Advertisement