చైనాలో ‘స్టార్‌ఫిష్‌’ విమానాశ్రయం

Giant Beijing starfish airport set to open on eve of China 70th birthday - Sakshi

రూ. 1.20 లక్షల కోట్లతో నిర్మాణం

బీజింగ్‌: భారీ స్టార్‌ఫిష్‌ ఆకారంలో చైనా ప్రభుత్వం నిర్మిస్తున్న బీజింగ్‌లోని డాక్సింగ్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కమ్యూనిస్ట్‌ ప్రభుత్వం ఏర్పడి 70 ఏళ్ల వేడుకల సందర్భంగా ప్రారంభించనున్నారు. పది ఫుట్‌బాల్‌ మైదానాలకు సమానమైన స్థలంలో కళ్లు చెదిరేలా రూ. 1.20 లక్షల కోట్ల (17.5 బిలియన్‌ డాలర్ల)తో ప్రతిష్టాత్మకంగా దీనిని నిర్మిస్తున్నారు. 1949 అక్టోబర్‌ 1న మావో జెడాంగ్‌ పీపుల్స్‌ రిపబ్లిక్‌ను స్థాపించారు. దాన్ని పురస్కరించుకొని సెప్టెంబరు 30న ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. 2025 కల్లా నాలుగు రన్‌వేలతో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్న ఈ విమానాశ్రయం ఏడాదికి 7.2 కోట్ల మందిని గమ్యస్థానాలకు చేరవేయగలదు. 2040 కల్లా మిలిటరీకి ప్రత్యేక రన్‌వే సహా మొత్తం ఎనిమిది రన్‌వేలతో సిద్ధం కానుందని అధికారులు తెలిపారు.  అమెరికాలోని అట్లాంటా విమానాశ్రయం, రెండు టెర్మినల్స్‌తో కలిపి 10కోట్ల మందిని గమ్యస్థానాలకు చేరవేస్తోంది.
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top