చందమామ ముందే పుట్టాడు | Germany Colon University Research On Moon | Sakshi
Sakshi News home page

చందమామ ముందే పుట్టాడు

Jul 31 2019 8:09 AM | Updated on Jul 31 2019 8:09 AM

Germany Colon University Research On Moon - Sakshi

బెర్లిన్‌: చంద్రుడు ఉద్భవించిన కాలం గురించి ఇప్పటివరకు మనకి తెలిసినదంతా వాస్తవం కాదని తాజా పరిశోధనలో వెల్లడైంది. సౌర వ్యవస్థ ఏర్పడిన సుమారు 5 కోట్ల ఏళ్ల తర్వాత చంద్రుడు ఉద్భవించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇంతకుముందు పరిశోధనల్లో సౌర వ్యవస్థ ఏర్పడిన సుమారు 15 కోట్ల ఏళ్ల తర్వాత చంద్రుడు పుట్టినట్లు అంచనా వేశారు. అయితే అది నిజం కాదని జర్మనీలోని కొలోన్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అధ్యయన పూర్వకంగా కనుగొన్నారు. దీని ప్రకారం సుమారు 456 కోట్ల ఏళ్ల కింద సౌర వ్యవస్థ ఆవిర్భవించిందని, ఆ తర్వాత అంటే సౌర వ్యవస్థ ఏర్పడిన సుమారు 5 కోట్ల ఏళ్లకు చంద్రుడి ఉనికిలోకి వచ్చాడని వారు వెల్లడించారు.

దీనికోసం అపోలో మిషన్‌ సమయంలో సేకరించిన రసాయనాలను విశ్లేషించారు. 1969 జూలై 21న మొదటిసారి చంద్రుడిపై అపోలో–11 మిషన్‌ ద్వారా మనిషి అడుగుపెట్టాడు. అక్కడ గడిపిన కొన్ని గంటల్లోనే వారు సుమారు 21.55 కిలోల మట్టిని తీసుకొచ్చారు. ప్రస్తుతం దీనిని విశ్లేషించే చంద్రుడి పుట్టుక గురించి కనుగొన్నారు. అలాగే చంద్రుడి వయసుని కనుగొనడం ద్వారా భూ గ్రహం ఎప్పుడు.. ఎలా పుట్టిందనే విషయాన్ని తెలుసుకోవచ్చని చెబుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement