పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ

France Rejects Pakistan request to intervene in Kashmir issue - Sakshi

పారిస్‌: కశ్మీర్‌ అంశాన్ని అంతర్జాతీయ వివాదంగా చూపేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న పొరుగు దేశం పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా ఫ్రాన్స్‌ కూడా పాక్‌కు గట్టి షాకిచ్చింది. కశ్మీర్‌ ద్వైపాక్షిక అంశమన్న తమ వైఖరికి కట్టుబడి ఉన్నామని ఫ్రాన్స్‌ మరోసారి స్పష్టం చేసింది. ఈ అంశాన్ని చర్చల ద్వారా భారత్‌-పాక్‌ పరిష్కరించుకోవాలని సూచించింది.

ఫ్రెంచ్‌ విదేశాంగ మంత్రి జీన్‌ యెవ్స్‌ లీ డ్రియాన్‌తో పాక్‌ విదేశాంగ మంత్రి షా మహమూద్‌ ఖురేషీ టెలిఫోన్‌లో మాట్లాడారు. కశ్మీర్‌ విషయంలో తమ వాదనకు మద్దతు ఇవ్వాలని ఫ్రాన్స్‌ను ఖురేషీ కోరారు. అయితే, ఇది ద్వైపాక్షిక అంశమన్న తమ వైఖరిలో మార్పు లేదని, ద్వైపాక్షిక చర్చల ద్వారానే ఈ అంశాన్ని పరిష్కరించుకోవాలని లీ డ్రియాన్‌ సూచించారు. ఆర్టికల్‌370 రద్దు నేపథ్యంలో ఇరుదేశాలు సంయమనం పాటిస్తూ.. ఉద్రికత్తలు తగ్గించడానికి ప్రయత్నించాలని కోరారని ఫ్రాన్స్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top