ఉరి కరెక్టే.. ఉక్కుపిడికిలితో ఢీకొంటాం: పాక్‌ | Followed all rules and laws of the land on Jadhav's sentence: Pak defence minister | Sakshi
Sakshi News home page

ఉరి కరెక్టే.. ఉక్కుపిడికిలితో ఢీకొంటాం: పాక్‌

Apr 11 2017 8:01 PM | Updated on Sep 5 2017 8:32 AM

ఉరి కరెక్టే.. ఉక్కుపిడికిలితో ఢీకొంటాం: పాక్‌

ఉరి కరెక్టే.. ఉక్కుపిడికిలితో ఢీకొంటాం: పాక్‌

భారత్‌ నేవీ మాజీ అధికారి కులభూషణ్‌ జాదవ్‌కు మరణ శిక్ష విషయంలో వెనక్కి తగ్గబోమని పాకిస్థాన్‌ స్పష్టం చేసింది. ఈ శిక్ష విధించడాన్ని పాక్‌ సమర్థించుకుంది.

న్యూఢిల్లీ: భారత్‌ నేవీ మాజీ అధికారి కులభూషణ్‌ జాదవ్‌కు మరణ శిక్ష విషయంలో వెనక్కి తగ్గబోమని పాకిస్థాన్‌ స్పష్టం చేసింది. ఈ శిక్ష విధించడాన్ని పాక్‌ సమర్థించుకుంది. జాదవ్‌ గూఢచర్యం నెరిపినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, ఉరి శిక్ష విధించడానికి ముందు అన్ని నియమనిబంధనలు పాటించామని, తమ చట్టాలకు లోబడే ఈ శిక్ష విధించామని పాక్‌ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్‌ చెప్పారు. చట్టానికి విరుద్ధంగా ఒక్కటి కూడా చేయలేదని చెప్పారు.

తమ దేశ సార్వభౌమత్వానికి విరుద్ధంగా పనిచేసే శక్తుల విషయంలో ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు ఇవ్వబోమని స్పష్టం చేశారు. దీని ద్వారా జాదవ్‌ విషయంలో పాక్‌ మొండి వైఖరి స్పష్టమవుతోంది. ‘జాదవ్‌కు విధించిన ఉరి శిక్ష పూర్వాలోచనతో చేసిన పని భారత్‌ అంటోంది. కానీ, మేం మాత్రం చట్టానికి లోబడే కేసును విచారించాం. నియమ నిబంధనలు పాటించాం. పాకిస్థాన్‌ ఈ విషయంలో ఎలాంటి ప్రత్యేక కన్సెషన్‌ ఇవ్వబోదు. మా దేశ సార్వభౌమాధికారన్ని దెబ్బకొట్టాలని, తమ దేశ సుస్థిరతకు భంగంకలిగించాలనే చూసే శక్తులను ఉక్కు పిడికిలితో ఎదుర్కొంటాం’ అని అసిఫ్‌ మరింత రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement