బస్సుపై బాంబు దాడి.. ఐదుగురు మృతి | Five killed in bomb attack on bus in Bangladesh | Sakshi
Sakshi News home page

బస్సుపై బాంబు దాడి.. ఐదుగురు మృతి

Feb 7 2015 8:53 AM | Updated on Sep 2 2017 8:57 PM

బాంబు దాడిలో ఐదుగురు మృతిచెందడంతో పాటు 29 మంది గాయపడ్డ సంఘటన బంగ్లాదేశ్ లో చోటుచేసుకుంది.

ఢాకా: బాంబు దాడిలో ఐదుగురు మృతిచెందడంతో పాటు 29 మంది గాయపడ్డ సంఘటన బంగ్లాదేశ్ లో చోటుచేసుకుంది. ఈ ఘటన శుక్రవారం రాత్రి బంగ్లాదేశ్లోని గాయ్బంధా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి... గాయ్బంధా జిల్లాలో పోలీసుల రక్షణలో ఉన్న నపు పరిబహన్ అనే బస్సుపై గుర్తుతెలియని దుండగులు రాత్రి 11:30 గంటలకు పెట్రోల్ బాంబు దాడి చేశారని చెప్పారు.

పెట్రోల్ బాంబు దాడిలో ముగ్గురు చిన్నారులు సహా ఐదుమంది మృతిచెందడంతో పాటు బస్సులోని ప్రయాణికులు 29 మందికి కాలిన గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో 11 మందిని రంగపూర్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ కు, మరికొందరిని గాయ్ బంధా సదర్ ఆసుపత్రికి తరలించామని పోలీసు అధికారి చెప్పారు. ప్రయాణికులతో పాటు పోలీసులు గాయపడ్డారని, కొందరి పరిస్థితి బాగాలేదన్నారు. రంగపూర్ ఆసుపత్రి ప్లాస్టిక్ సర్జరీ విభాగం చీఫ్ డాక్టర్ మరుఫల్ ఇస్లామ్ మాట్లాడుతూ... తీవ్ర గాయాలపాలైన తొమ్మిదేళ్ల బాలుడు చికిత్స పొందుతుండగానే మరణించాడని తెలిపారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement