బీఎండబ్ల్యూ కారు ఎయిర్‌ బ్యాగ్‌ పేలుడు కలకలం

Faulty Takata airbag in BMW leaves Adelaide woman with serious injuries - Sakshi

టకాటా ఫాల్టీ ఎయిర్‌బ్యాగ్ మరోసారి తీవ్ర ప్రమాదానికి దారి తీసింది. బీఎండబ్ల్యూ కారులో ఎయిర్‌ బ్యాగ్‌ అకస్మాత్తుగా పేలడంతో కారు యజమానురాలు తీవ్రంగా గాయపడిన సంఘటన కలకలం  రేపుతోంది.  జూన్‌ 18న ఈ పేలుడు సంభవించింది.  సం‍స్థ దీనిపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది.

లోపభూయిష్ట ఎయిర్ బ్యాగ్ పేలుడుతో అడిలైడ్‌కు చెందిన జార్జియా బెక్‌ తీవ్ర గాయాలతో  బయటపడ్డారు.  డ్రైవర్‌కు చెందిన ఎయిర్‌బ్యాగ్  ఒక్కసారిగా పేలి కారు స్టీరింగ్‌ నుండి, విండి స్క్రీన్‌లోంచి పై కప్పుకు ఎగిసింది. దీంతో  జార్జియా గడ్డంకింద, చేతికి తీవ్ర గాయాలు కావడంతో ఆమె  ఆసుపత్రి పాలయ్యారు.  ఇటీవల సంస్థ  చేపట్టినభారీ రీకాల్‌లో భాగంగా  ప్యాసింజెర్‌ వైపు ఎయిర్‌బ్యాగ్‌ను రీప్లేస్‌ చేసినట్టు ఆమె తెలిపారు. అయితే   డ్రైవర్‌ వైపు ఎయిర్‌ బ్యాగును పెద్దగా పట్టించుకోలేదు. అదే ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగినపుడు నల్లటి పొగ అలుముకుందని, గన్‌ పౌడర్‌ వాసన వచ్చిందంటూ  భయంకరమైన తన అనుభవాన్ని జార్జియా బెక్‌ గుర్తు చేసుకున్నారు.

మరోవైపు  ఈ ఘటనపై స్పందించిన  బీఎండబ్ల్యూఅంతర్జాతీయ దర్యాప్తునకు ఆదేశించింది. ఫోరెన్సిక్ పరీక్ష కోసం ఎయిర్‌బ్యాగ్‌ను జర్మనీలోని ప్రధాన కార్యాలయానికి పంపింది. అయితే 2009 లో ప్రమాదానికి గురైన  ఈ కారును పాత యజమాని ఆ విషయాన్ని దాచిపెట్టి , జార్జియాకు విక్రయించినట్టుగా సంస్థ ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

కాగా టకాటా ఎయిర్‌ బ్యాగు లోపాల కారణంగా అనేక ప్రమాదాలు సంభవించడంతో హోండా, బీఎండబ్ల్యూ లాంటి  పలు కంపెనీలు ఇప్పటికే లక్షలాది కార్లను రీకాల్‌ చేశాయి.  కానీ,  ప్రాణాంతకమైన ఎయిర్‌బ్యాగ్‌లతో 7లక్షల కార్లు ఇప్పటికీ రోడ్లపై  ఉన్నట్టు తెలుస్తోంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top