ఇక ఫేస్‌బుక్‌లో టైమ్‌ మేనేజ్‌మెంట్‌ | Facebook, Instagram to introduce time-management tools | Sakshi
Sakshi News home page

ఇక ఫేస్‌బుక్‌లో టైమ్‌ మేనేజ్‌మెంట్‌

Aug 2 2018 4:56 AM | Updated on Aug 2 2018 4:56 AM

Facebook, Instagram to introduce time-management tools - Sakshi

పారిస్‌: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో మీరు  ఎక్కువ సమయం గడిపేస్తున్నారని బాధపడుతున్నారా..? ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లకు రోజుకు పరిమిత సమయమే కేటాయించాలని కోరుకునే వారికోసం ఈ రెండు సోషల్‌ మీడియా సైట్‌లలో టైమ్‌ మేనేజ్‌మెంట్‌ ఆప్షన్‌లను ప్రవేశపెట్టనున్నట్లు ఫేస్‌బుక్‌ ప్రకటించింది. దీనిలో భాగంగా నోటిఫికేషన్లను పరిమితం చేయడం, ఎంతసేపు ఆయా సైట్‌లలో గడిపారో తెలుసుకునేలా కొత్త ఆప్షన్లను తీసుకురానున్నట్లు తెలిపింది. దీనికోసం యూజర్లు ముందుగా ఎంత సమయం ఈ సైట్లలో గడపాలనుకుంటున్నారో సమయం ఫిక్స్‌చేసుకోవాలి. తర్వాత ఫేస్‌బుక్‌ నుంచి ఓ అలర్ట్‌ వస్తుంది. దీంతో యూజర్లు ఈ సైట్‌లను వదిలి ఇతర పనుల్లో నిమగ్నం అయ్యే అవకాశం ఉంటుందని సంస్థ భావిస్తోంది. అలాగే మొబైల్స్‌కు వచ్చే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల నోటిఫి కేషన్లను డీయాక్టివేట్‌ చేసుకునే ఆప్షన్‌ను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించింది.

Advertisement
 
Advertisement
Advertisement