డాలస్‌లో నల్లజాతీయుల ఆందోళన ఉద్రిక్తం | Excited concern blacks in Dallas | Sakshi
Sakshi News home page

డాలస్‌లో నల్లజాతీయుల ఆందోళన ఉద్రిక్తం

Jul 11 2016 2:00 AM | Updated on Apr 4 2019 3:25 PM

అమెరికాలో నల్లజాతీయులపై పోలీసుల తీరుకు నిరసనగా వివిధ ప్రాంతాల్లో చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తంగా మారింది.

డాలస్ : అమెరికాలో నల్లజాతీయులపై పోలీసుల తీరుకు నిరసనగా వివిధ ప్రాంతాల్లో చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తంగా మారింది. ఆదివారం డాలస్‌లో పోలీసులపై రాళ్లు, బాటిళ్లు, టపాసులు, చేతికందిన లోహపు ముక్కలతో నల్లజాతీయులు దాడి చేశారు. ఈ ఘటనలో 21 మంది పోలీసులకు గాయాలయ్యాయి. దీంతో.. 200 మందిని పోలీసులు అరెస్టు చేశారు. గతవారం ఇద్దరు నల్లజాతీయులను పోలీసుల కాల్చి చంపటంపై అమెరికాలో ఆందోళనలు  రోజురోజుకూ ఉధృతమవుతున్నాయి.

‘నల్లవారి జీవితాల విలువైనవే’ (బ్లాక్ లైవ్స్ మేటర్స్)అనే నినాదంతో ఉద్యమిస్తున్న వారంతా డాలస్‌లో భారీ నిరసన ర్యాలీ నిర్వహించగా.. ఉద్రిక్తపరిస్థితులు తలెత్తటంతో 200 మందిని పోలీసులు అరెస్టు చేశారు. న్యూయార్క్, లాస్ ఏంజిలస్, శాన్ ఫ్రాన్సిస్కోల్లో శాంతియుత ఆందోళనలు జరపగా.. మినెసొటా,సెయింట్ పాల్ ప్రాంతాల్లో.. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో 102మందిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement