బంగారం కోసం వెళ్లి 11 మంది మృతి | Eleven Indonesians feared dead in gold mine accident | Sakshi
Sakshi News home page

బంగారం కోసం వెళ్లి 11 మంది మృతి

Oct 26 2016 4:58 PM | Updated on Sep 4 2017 6:23 PM

బంగారం కోసం వెళ్లి 11 మంది మృతి

బంగారం కోసం వెళ్లి 11 మంది మృతి

బంగారం కోసం అక్రమంగా తవ్వకాలు జరుపుతున్న 11 మంది సజీవ సమాధి అయిన ఘటన ఇండొనేషియాలో చోటుచేసుకుంది.

జకార్తా: బంగారం కోసం అక్రమంగా తవ్వకాలు జరుపుతున్న 11 మంది సజీవ సమాధి అయిన ఘటన ఇండొనేషియాలో చోటుచేసుకుంది. సుమత్రా దీవిలో ఎలాంటి అనుమతులు లేకుండా సుమారు 50 మీటర్ల లోతులో బంగారం కోసం తవ్వకాలు జరుపుతుండగా ప్రమాదం జరిగింది.  భారీ వర్షం కురవడంతో గనిలోకి మట్టి కూరుకుపోయింది. 21 నుంచి 55 ఏళ్ల మధ్య వయసున్న 11 మంది సజీవ సమాధి అయ్యారని వీరిలో ఎవరూ బ్రతికే అవకాశం లేదని స్థానిక పోలీసు అధికారి ట్రెస్నాడి వెల్లడించారు. మృతదేహాలను వెలికితీసేందుకు సహాయక బలగాలు ప్రయత్నిస్తున్నాయి.

బంగారం ధరకు రెక్కలొచ్చిన నేపథ్యంలో ఇండొనేషియాలో అక్రమ బంగారు గనుల సంఖ్య పెరిగిపోయింది. గత ఏడాది అక్టోబర్లో జావా దీవిలో నిరుపయోగంగా ఉన్న బంగారు గనిలోకి బంగారం కోసం వెళ్లిన 12 మంది మృతి చెందారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement