ఈఫిల్‌ టవర్‌ మూసివేత!

Eiffel tower Was closed For Some days Due To Protests - Sakshi

పారిస్‌ : ఫ్రాన్స్‌లో చెలరేగుతున్న అల్లర్ల కారణంగా ఈఫిల్‌ టవర్‌ను కొన్నిరోజుల వరకు మూసివేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. గత కొంతకాలంగా అక్కడ హింసాత్మక సంఘటనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందన, జీవన వ్యయాల పెరుగుదలకు నిరసనగా అక్కడ ఆందోళనలు జరగుతున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వం అత్యవసర స్థితిని విధించే ఆలోచనలో ఉంది. 

అయితే అక్కడ పరిస్థితులు ఇంకా తీవ్రతరం కానున్న నేపథ్యంలో పారిస్‌లో ఉండే షాపింగ్‌మాల్స్‌, మ్యూజియమ్స్‌, థియేటర్స్‌లను కూడా మూసివేశారు. పరిస్థితి సద్దుమణిగిన తరువాత వీటిని తెరవనున్నట్లు సమాచారం. తాజాగా ఫ్రాన్స్‌లో చోటుచేసుకున్న విధ్వంసంలో 23 మంది భద్రతా సిబ్బంది సహా 263 మంది గాయపడగా, పలు వాహనాలు, భవనాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఒక్క పారిస్‌లోనే 133 మంది గాయపడ్డారు. గొడవలకు కారకులైన 412 మందిని పోలీసులు అరెస్టు చేశారు. దశాబ్దకాలంలో ఫ్రాన్స్‌లో ఇంత భారీ స్థాయిలో ఆందోళనలు జరగడం ఇదే ప్రథమం. 

చదవండి : ఫ్రాన్స్‌లో ఆందోళనలు హింసాత్మకం

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top