ప్లాస్టిక్‌ వస్తువులలో ఆహారం తింటున్నారా.. జాగ్రత్త | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్‌ వస్తువులలో ఆహారం తింటున్నారా.. జాగ్రత్త

Published Sat, Jul 7 2018 5:41 PM

Eating Food In Plastic Goods Cause Inflammatory Bowel Disease - Sakshi

న్యూయార్క్‌ : ప్లాస్టిక్‌ వాడకం వల్ల పర్యావరణానికే కాదు మనుషుల ప్రాణాలకు కూడా ముప్పేనట. ప్లాస్టిక్‌ వస్తువులలో ఉంచిన వేడివేడి ఆహార పదార్థాలను తీసుకోవటం వల్ల జీర్ణకోశ సంబంధ రోగాలు వచ్చే అవకాశం ఎక్కువని తాజా పరిశోధనలో తేలింది. అమెరికాకు చెందిన ‘టెక్సాస్‌ ఏ అండ్‌ ఎమ్‌ యూనివర్శిటీ’ వారు జరిపిన పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ప్లాస్టిక్‌ వస్తువులలో ఉంచిన ఆహార పదార్థాలను తీసుకోవటం వల్ల ఇంఫ్లమేటరి బోవెల్‌ డిసీస్‌(ఐబీడీ) అనే జీర్ణకోశ సంబంధ వ్యాధి దాడి చేసే అవకాశం ఎక్కువని తేలింది.

ప్లాస్టిక్‌ తయారీలో ఉపయోగించే బిస్‌ ఫినాల్‌ ఏ(బీపీఏ) అనే రసాయనం కారణంగా మనిషి జీవితకాలం తగ్గిపోతుందని పరిశోధకులు పేర్కొన్నారు. ప్లాస్టిక్‌ వస్తువులలో ఉంచిన ఆహార పదార్థాలలోని పోషక విలువలను శరీరం గ్రహించటం కష్టంగా మారుతుందని తేల్చారు. అంతేకాకుండా మనం ఉపయోగించే ఫేస్‌ వాష్‌లలో కూడా ప్లాస్టిక్‌ కణాలు ఉంటాయని నిర్థారించారు. బీపీఏ తినే ఆహార పదార్థాలలో చేరటం ద్వారా మానవ ప్రవర్తనలో మార్పులు తేవటమే కాక చిన్నపిల్లల మెదడుపై కూడా ప్రభావం చూపుతుందని వెల్లడైంది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement