నిజంగా సరస్వతీ పుత్రికే!

Dubai teen gets acceptance letters from 7 US universities - Sakshi

దుబాయ్‌: సాధారణంగా అమెరికాలోని ఏదో ఒక విశ్వవిద్యాలయంలో సీటు సంపాదించుకోవడానికి సగటు భారతీయ విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతుంటారు. కానీ దుబాయ్‌లో ఉండే భారతీయ యువతి సిమోనే నూరాలీ(17) మాత్రం ఇందుకు మినహాయింపు. ఎందుకంటే తమ విద్యాసంస్థలో చేరాలని అమెరికాలోని 7 ప్రఖ్యాత వర్సిటీలు ఆహ్వానించాయి. అవి యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియా, డార్ట్‌మౌత్‌ కాలేజ్, యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా, జాన్స్‌ హాప్‌కిన్స్‌ విశ్వవిద్యాలయం, జార్జ్‌టౌన్‌ వర్సిటీ, జార్జ్‌ వాషింగ్టన్‌ వర్సిటీ. అమెరికా వర్సిటీల్లో ప్రవేశం కోసం నిర్వహించే ఏసీటీ పరీక్షలో 36కు 36 పాయింట్లు సాధించింది. భారత్‌లో మహిళల అక్రమ రవాణాపై సిమోనే రాసిన ‘ది గర్ల్‌ ఇన్‌ ది పింక్‌ రూమ్‌’ పుస్తకాన్ని పరిశోధన కోసం వాడుతున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top