breaking news
University Seat
-
నిజంగా సరస్వతీ పుత్రికే!
దుబాయ్: సాధారణంగా అమెరికాలోని ఏదో ఒక విశ్వవిద్యాలయంలో సీటు సంపాదించుకోవడానికి సగటు భారతీయ విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతుంటారు. కానీ దుబాయ్‌లో ఉండే భారతీయ యువతి సిమోనే నూరాలీ(17) మాత్రం ఇందుకు మినహాయింపు. ఎందుకంటే తమ విద్యాసంస్థలో చేరాలని అమెరికాలోని 7 ప్రఖ్యాత వర్సిటీలు ఆహ్వానించాయి. అవి యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా, డార్ట్మౌత్ కాలేజ్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం, జార్జ్‌టౌన్ వర్సిటీ, జార్జ్ వాషింగ్టన్ వర్సిటీ. అమెరికా వర్సిటీల్లో ప్రవేశం కోసం నిర్వహించే ఏసీటీ పరీక్షలో 36కు 36 పాయింట్లు సాధించింది. భారత్‌లో మహిళల అక్రమ రవాణాపై సిమోనే రాసిన ‘ది గర్ల్ ఇన్ ది పింక్ రూమ్’ పుస్తకాన్ని పరిశోధన కోసం వాడుతున్నారు. -
ఎస్సీ వర్గీకరణతో రాష్ట్రంలోనే లబ్ధి: చెన్నయ్య
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ వర్గీకరణ జరిగితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విశ్వవిద్యాలయ సీట్లకు మాత్రమే వర్తిస్తుందని.. కేంద్ర ఉద్యోగాలు, విద్యాలయాల సీట్లకు, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకు వర్తించదని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య స్పష్టం చేసారు. వర్గీకరణతో మాదిగలు ఒక శాతం లబ్ధి పొందవచ్చునేమో గానీ దేశవ్యాప్తంగా చమారులు, మహారులు, ఆంధ్రలో మాదిగలు నష్టపోతారని.. దళితులు, ఎస్టీ ఉపకులాల మధ్య వైషమ్యాలు, సంఘర్షణ పెరిగి దళితుల ఐక్యతకు విఘాతం ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. చమారులు, మహారులు, అరుంధతీయులు, మాయావతి (బీఎస్పీ), పాశ్వాన్ (లోక్ జన శక్తి), రాందాస్ అఠావలే(ఆర్పీఐ) వంటి వారు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. వర్గీకరణే పరిష్కారం కాదని సుప్రీంకోర్టు ఇప్పటికే తీర్పులో స్పష్టం చేసిందన్నారు. కాగా, వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో చేపట్టిన రిలే నిరాహార దీక్ష 11వ రోజుకు చేరింది.