breaking news
ACT exam
-
నిజంగా సరస్వతీ పుత్రికే!
దుబాయ్: సాధారణంగా అమెరికాలోని ఏదో ఒక విశ్వవిద్యాలయంలో సీటు సంపాదించుకోవడానికి సగటు భారతీయ విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతుంటారు. కానీ దుబాయ్‌లో ఉండే భారతీయ యువతి సిమోనే నూరాలీ(17) మాత్రం ఇందుకు మినహాయింపు. ఎందుకంటే తమ విద్యాసంస్థలో చేరాలని అమెరికాలోని 7 ప్రఖ్యాత వర్సిటీలు ఆహ్వానించాయి. అవి యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా, డార్ట్మౌత్ కాలేజ్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం, జార్జ్‌టౌన్ వర్సిటీ, జార్జ్ వాషింగ్టన్ వర్సిటీ. అమెరికా వర్సిటీల్లో ప్రవేశం కోసం నిర్వహించే ఏసీటీ పరీక్షలో 36కు 36 పాయింట్లు సాధించింది. భారత్‌లో మహిళల అక్రమ రవాణాపై సిమోనే రాసిన ‘ది గర్ల్ ఇన్ ది పింక్ రూమ్’ పుస్తకాన్ని పరిశోధన కోసం వాడుతున్నారు. -
ఏసీటీ పరీక్షలో తెలుగు విద్యార్థి అరుదైన రికార్డు
విజయవాడ: అమెరికా యూనివర్సిటీల్లో ప్రవేశానికి నిర్వహించే ఏసీటీ (అమెరికన్ కాలేజ్ టెస్ట్)లో తెలుగు విద్యార్థి అరుదైన రికార్డు సాధించాడు. విజయవాడ సూపర్‌విజ్ అధినేత గుప్తా కుమారుడు మామిడి సాయి ఆకాష్ ఏసీటీలో 36 పాయింట్లకు 36 పాయింట్లు సాధించి ప్రపంచంలోనే ఫస్ట్ ర్యాంకు సాధించి సత్తాచాటాడు. దీంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అమెరికాలోని 16 యూనివర్సిటీలు స్కాలర్షిప్లు అందించి మరీ ఆకాష్‌ను తాము చేర్చుకుంటామంటూ స్వాగతిస్తున్నాయి. స్టాన్ఫోర్డ్, కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఏల్, ప్రిన్స్టన్, కొలండియా, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్క్లి, బ్రౌన్, డార్జ్‌మౌత్, డ్యూక్, మిషిగన్, జార్జియా టెక్, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఆస్టిన్, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్, ఇల్లినాయిస్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా సాండియాగో, రైస్ వంటి యూనివర్సిటీలు సాయి ఆకాష్ ప్రవేశానికి ఆహ్వానం పలికాయి. పారిశ్రామికవేత్తగా ఎదగాలన్నదే లక్ష్యం: సాయి ఆకాష్ ఎంతో మంది విద్యార్థులను జాతీయస్థాయి ర్యాంకర్లుగా తీర్చిదిద్దిన సూపర్‌విజ్ గుప్తా తనయునిగా తనకు ప్రపంచస్థాయిలో ఫస్ట్ ర్యాంకు రావడం సంతోషంగా ఉందని సాయిఆకాష్ పేర్కొన్నాడు. శనివారం సూపర్‌విజ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తనకు వచ్చిన అడ్మిషన్ ఆఫర్స్‌ను చూపించారు. అండర్ గ్రాడ్యుయేషన్ కోసం కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్ట్ను ఎంచుకున్నట్లు ఆయన తెలిపారు.