మీరు అసలు మనుషులేనా..ఇంతలా హింసిస్తారా? | Donkeys Painted To Look Like Zebras For Safari Themed Party | Sakshi
Sakshi News home page

మీరు అసలు మనుషులేనా..సిగ్గుచేటు!

Jul 18 2019 6:33 PM | Updated on Jul 18 2019 6:34 PM

Donkeys Painted To Look Like Zebras For Safari Themed Party - Sakshi

ప్రతీ ఒక్కరి జీవితంలో వివాహమనేది ఓ మధుర ఙ్ఞాపకం. అలాంటి క్షణాలను రొటీన్‌గా కాకుండా సమ్‌థింగ్‌ స్పెషల్‌గా చేసుకోవాలని కొందరు కోరుకుంటుంటారు. స్పెయిన్‌కు చెందిన ఓ జంట కూడా తమ వివాహాన్ని వెరైటీగా ప్లాన్‌ చేసింది. కాడిజ్‌ పట్టణంలో బీచ్‌ తీరాన సఫారీ థీమ్‌తో పెళ్లి వేడుక చేసుకుంది. అయితే వారు చేసిన వినూత్న ప్రయత్నంపై జంతు ప్రేమికులు మండిపడుతున్నారు.

ఇంతకీ ఏం జరిగిందంటే... థీమ్‌ వెడ్డింగ్‌లో భాగంగా అతిథులను ఆకట్టుకునేందుకు పెళ్లివారు వేడుక ప్రాంగణంలో రెండు జీబ్రాలను ఏర్పాటు చేశారు. అయితే అవి నిజంగా జీబ్రాలు కావు. గాడిదలకు పెయింట్‌ వేసి జీబ్రాలుగా చిత్రీకరించారు. ఈ క్రమంలో వెరైటీ వెడ్డింగ్‌ గురించి ప్రస్తావిస్తూ ఏంజెల్‌ థామస్‌ అనే వ్యక్తి.. ‘తమ స్వార్థం కోసం జంతువులను ఇలా హింసిస్తారా’ అంటూ ఫొటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. ఈ ఫొటోలు వైరల్‌గా మారడంతో సదరు జంటపై జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరు అసలు మనుషులేనా.. నిజంగా ఇది సిగ్గు చేటు. మూగ జీవాలను ఇంతలా వేధిస్తారా’ అంటూ మండిపడుతున్నారు. కాగా ఈ విషయంపై స్పందించిన స్పెయిన్‌ పర్యావరణ శాఖ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement