చైనాపై మరింత కోపంగా ఉన్నాను: ట్రంప్

Donald Trump More Angry at China Over Corona Virus - Sakshi

వాషింగ్టన్‌: ప్రపంచాన్ని కలవర పెడుతోన్న కరోనా వైరస్‌ అమెరికాలో తీవ్ర రూపం దాల్చింది. ప్రస్తుతం కరోనా కేసుల్లో అమెరికా ప్రపంచలోనే ప్రథమ స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కరోనా వైరస్‌ చైనా సృష్టే అన్న డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా మరోసారి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చైనాపై తన కోపం రోజు రోజుకు పెరుగుతుందని ట్రంప్‌ తెలిపారు. మహమ్మారి విషయంలో తాము పూర్తి స్థాయిలో నియంత్రణ సాధించలేదని అమెరికన్‌ వైద్యులు ట్రంప్‌ను హెచ్చరించారు. ఈ క్రమంలో ‘మహమ్మారి వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోంది. అమెరికాతో సహా అన్ని దేశాలకు ఎంతో నష్టాన్ని చేకూర్చింది. ప్రస్తుతం చైనా మీద నా కోపం అంతకంతకు పెరుగుతోంది’ అని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. (కరోనా : అమెరికాకు కొత్త హెచ్చరిక)

కరోనా విషయంలో ట్రంప్‌ చైనాతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ మీద ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మహమ్మారి గురించి హెచ్చరించడంలో డబ్ల్యూహెచ్‌ఓ అలసత్వం ప్రదర్శించిందని.. చైనాను వెనకేసుకొచ్చిందని ఆరోపించారు. అంతేకాక డబ్ల్యూహెచ్‌ఓకు కేటాయించే నిధులను తాత్కలికంగా నిలిపివేస్తున్నట్లు ట్రంప్‌ గతంలో ప్రకటించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top