పిజ్జా లేటయిందేంటి అన్నందుకు పొడిచేశాడు! | Domino Pizza Delivery Man in Covina, California, Stabs Customer: Cops | Sakshi
Sakshi News home page

పిజ్జా లేటయిందేంటి అన్నందుకు పొడిచేశాడు!

Jan 4 2016 7:03 PM | Updated on Sep 3 2017 3:05 PM

పిజ్జా లేటయిందేంటి అన్నందుకు పొడిచేశాడు!

పిజ్జా లేటయిందేంటి అన్నందుకు పొడిచేశాడు!

అమెరికాలోని కాలిఫోర్నియాలో డొమినోస్ పిజ్జాకు చెందిన ఓ డెలివరీ ఉద్యోగి వినియోగదారున్ని కత్తితో పొడిచాడు.

కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియాలో డొమినోస్ పిజ్జాకు చెందిన ఓ డెలివరీ ఉద్యోగి వినియోగదారున్ని కత్తితో పొడిచాడు. పిజ్జా ఆలస్యంగా తీసుకురావడంపై గొడవ జరగడంతో అతను దుశ్చర్యకు పాల్పడ్డాడు.  ఈ ఘటనకు సంబంధించి కాలిఫోర్నియాలోని గ్లెన్ డోరాకు చెందిన మైఖేల్ చార్లెస్ (31)ను పోలీసులు అరెస్టు చేశారు. పిజ్జా డెలివరీ లేట్ అయినందుకు గొడవ జరగడంతో అతను 20 ఏళ్ల వ్యక్తిని పొడిచాడని పోలీసులు తెలిపారు.

దీంతో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయని, అయితే ప్రాణాపాయం లేదని చెప్పారు. కాలిఫోర్నియాలోని కొవిన్ లో శనివారం ఈ ఘటన జరిగింది. మెడపై, మణికట్టుపై గాయాలైన బాధితుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  అరెస్టైన నిందితుడు 30వేల డాలర్ల పూచీకత్తు బెయిల్ పై విడుదలయ్యాడు. అతనిపై మార్చ్ 21న పోలీసులు అభియోగాలు నమోదుచేయనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement