ఈత రాకున్నా పర్లేదు! | Do not need to know swimming | Sakshi
Sakshi News home page

ఈత రాకున్నా పర్లేదు!

Jun 13 2016 4:04 AM | Updated on Apr 3 2019 7:53 PM

ఈత రాకున్నా పర్లేదు! - Sakshi

ఈత రాకున్నా పర్లేదు!

జేమ్స్‌బాండ్ సినిమాలోని హీరో క్యారెక్టర్ వినూత్న పరికరాలతో ప్రత్యర్థులను బురిడీ కొట్టిస్తాడు కదా! సరిగ్గా అలాంటి పరికరాన్నే ఒకదాన్ని కొందరు రూపొందించారు.

జేమ్స్‌బాండ్ సినిమాలోని హీరో క్యారెక్టర్ వినూత్న పరికరాలతో ప్రత్యర్థులను బురిడీ కొట్టిస్తాడు కదా! సరిగ్గా అలాంటి పరికరాన్నే ఒకదాన్ని కొందరు రూపొందించారు. కాకపోతే అది ప్రత్యర్థులను చిత్తు చేయడానికి కాదు.. క్లిష్ట సమయంలో ఎవరికి వారు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి. సరికొత్తగా ఆవిష్కృతమైన కింగ్లీ అనే రిస్ట్ బ్యాండ్ కేవలం అలంకరణ కోసమే కాకుండా మీ ప్రాణాలను సైతం నిలబెడుతుంది. అదెలాగంటే ప్రమాదవశాత్తు నీళ్లలో పడినప్పుడు మీకు ఈత రాకున్నప్పటికీ మిమ్మల్ని నీటిలో తేలేలా చేస్తుంది.

నీటిలో మునిగినప్పుడు దీనికి గల మీట నొక్కితే చాలు దీనిలో అమర్చి ఉన్న బెలూన్ తెరుచుకుంటుంది. అంతేకాకుండా ప్రమాదంలో ఉన్న వారికి సంబంధించిన వ్యక్తులను సైతం ఇది అలర్ట్ చేస్తుంది. ప్రస్తుతం దీని మార్కెట్ ధర సుమారు రూ.7 వేల వరకూ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన  వివరాల ప్రకారం ఏటా నీటిలో మునిగిపోవడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా సుమారు 4 లక్షల మంది మృతి చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రిస్ట్ బ్యాండ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తయారీ దారులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement