దావూద్ పాక్‌లోనే ఉన్నాడు | Dawood in Pakistan, Will Get Him No Matter What: Rajnath Singh in Parliament | Sakshi
Sakshi News home page

దావూద్ పాక్‌లోనే ఉన్నాడు

May 12 2015 1:49 AM | Updated on Sep 3 2017 1:51 AM

మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్‌లోనే ఉన్నాడని కేంద్ర ప్రభుత్వం సోమవారం పార్లమెంటులో స్పష్టంచేసింది.

     కేంద్రం స్పష్టీకరణ
     ఆధారాలను పాక్‌కు ఇచ్చాం
     భారత్‌కు తీసుకొచ్చి కోర్టులో నిలబెడతాం: రాజ్‌నాథ్

 న్యూఢిల్లీ: మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్‌లోనే ఉన్నాడని కేంద్ర ప్రభుత్వం సోమవారం పార్లమెంటులో స్పష్టంచేసింది. ముంబై దాడుల సూత్రధారి అయిన దావూద్‌ను పాక్ నుంచి భారత్‌కు రప్పించేందుకు అవసరమైన అన్నిరకాల చర్యలు తీసుకుంటామని, ఇక్కడి న్యాయస్థానం ముందు నిలబెడతామని పేర్కొంది. దావూద్ ఎక్కడ ఉన్నాడో ప్రభుత్వానికి తెలియదంటూ గతవారం హోం శాఖ సహాయ మంత్రి హరిభాయ్ చౌదరీ లోక్‌సభలో ప్రకటన చేయడంపై  విపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశాయి. దీనిపై పెద్దఎత్తున దుమారం చెలరేగడంతో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం లోక్‌సభలో దావూద్ సమాచారంపై ప్రకటన చేశారు. ‘దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్‌లోనే తలదాచుకున్నట్లు మా వద్ద విశ్వసనీయ సమాచారం ఉంది. దీనిపై పాక్‌కు అన్నిరకాల సాక్ష్యాధారాలను ఇచ్చాం.అని రాజ్‌నాథ్ చెప్పారు.  
 మా దగ్గర లేడు: పాక్ హై కమిషనర్
 లక్నో: మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్‌లో లేడని భారత్‌లో పాక్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ సోమవారం స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement