దావూద్ ఇబ్రహీం ఆచూకీ దొరికింది | Dawood Ibrahim's location traced to Karachi | Sakshi
Sakshi News home page

దావూద్ ఇబ్రహీం ఆచూకీ దొరికింది

Dec 27 2014 12:19 AM | Updated on Sep 2 2017 6:47 PM

దావూద్ ఇబ్రహీం ఆచూకీ దొరికింది

దావూద్ ఇబ్రహీం ఆచూకీ దొరికింది

భారత్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆచూకీ కనుగొన్నారు.

భారత్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న అండర్ వరల్డ్  డాన్ దావూద్ ఇబ్రహీం ఆచూకీ కనుగొన్నారు. పాకిస్థాన్లోని కరాచీ నగర శివారు  ప్రాంతం క్లిఫ్టన్ నుంచి దావూద్ ఫోన్లో మాట్లాడినప్పటి సంభాషణలను ఓ పాశ్చాత్య నిఘా సంస్థ రికార్డు చేసింది.

ఆస్తి ఒప్పందానికి సంబంధించి దుబాయ్లో ఉంటున్న ఓ వ్యక్తితో దావూద్ మాట్లాడిన సమయంలో సంభాషణల్ని రికార్డు చేశారు. రెండు దశాబ్దాల క్రితం దావూద్ పాకిస్థాన్ పారిపోయిన తర్వాత భారత నిఘా సంస్థలు అతని ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మొదట్లో భారత్కు దావూద్ను అంతం చేసే అవకాశం వచ్చినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. భారత్ కమెండోలు దావూద్ ను టార్గెట్ చేసినపుడు, కొన్ని క్షణాలు ముందు భారత్కు చెందిన ఓ వ్యక్తి ఫోన్ చేసి కాల్చొద్దని ఆదేశాలు జారీ చేసినట్టు కథనాలు వెలువడ్డాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement