దావూద్‌ కొడుకు దారిలోనే ఛోటా షకీల్‌ కొడుకు..!

Dawood Ibrahim Follower Chhota Shakeel Son Takes Spiritual Path in Pakistan - Sakshi

సాక్షి, ముంబై : అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం ప్రధాన అనుచరుడు ఛోటా షకీల్‌కు షాక్‌ తగిలింది. అతని ఒక్కగానొక్క కొడుకు ఆధ్యాత్మిక జీవితం వైపు అడుగులేయడంతో అరవయ్యేళ్ల పైబడ్డ షకీల్‌కు ఏమీ పాలుపోవడం లేదు. షకీల్‌ కొడుకు ముబషీర్‌ షైక్‌ (18) పవిత్ర ఖురాన్‌లో ఉన్న 6236 పద్యాలు కంఠస్తం పట్టడంతో ఇప్పటికే వార్తల్లో నిలిచాడు. ముబషీర్‌ ‘హఫీజ్‌ ఎ ఖురాన్‌’గా మారాడనీ, కరాచీలోని ఓ మసీదులో ప్రజలకు ఖురాన్‌ను బోధిస్తున్నాడని  సమాచారం. ఇప్పటికే అండర్‌వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీంకు కొడుకు వ్యవహారంతో షాక్‌ తగలగా..ఆయన అనుచరుడు ఛోటా షకీల్‌కు కూడా అదే పరిస్థితి ఎదురైంది.

దావూద్‌ కొడుకు మోయిన్‌ నవాజ్‌ (31) ఇస్లాం మత ప్రబోధకుడి (మౌలానా)గా మారడంతో అతను డిప్రెషన్‌కు గురైనట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దావూద్‌, అతని ప్రధాన అనుచరుడు ఛోటా షకీల్‌ కొడుకు కూడా ఆధ్యాత్మిక జీవితానికే మొగ్గుచూపడంతో ముంబై అండర్‌వరల్డ్‌లో తీవ్ర అలజడి నెలకొంది. దీంతో డీ-గ్యాంగ్‌ సృ​ష్టించిన కోట్ల రూపాయల అధో ప్రపంచానికి వారసుడు కరువయ్యాడని కొందరు చెప్తున్నారు. కాగా, ముబషీర్‌ అంటే మంచి వార్తలు మోసుకురావడం అని అర్థం. దావూద్‌ కొడుకు స్ఫూర్తితో ముబషీర్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడని పలువురు భావిస్తున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top