breaking news
Chhota Shakiel
-
దావూద్ కొడుకు దారిలోనే ఛోటా షకీల్ కొడుకు..!
సాక్షి, ముంబై : అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ప్రధాన అనుచరుడు ఛోటా షకీల్‌కు షాక్ తగిలింది. అతని ఒక్కగానొక్క కొడుకు ఆధ్యాత్మిక జీవితం వైపు అడుగులేయడంతో అరవయ్యేళ్ల పైబడ్డ షకీల్‌కు ఏమీ పాలుపోవడం లేదు. షకీల్ కొడుకు ముబషీర్ షైక్ (18) పవిత్ర ఖురాన్లో ఉన్న 6236 పద్యాలు కంఠస్తం పట్టడంతో ఇప్పటికే వార్తల్లో నిలిచాడు. ముబషీర్ ‘హఫీజ్ ఎ ఖురాన్’గా మారాడనీ, కరాచీలోని ఓ మసీదులో ప్రజలకు ఖురాన్‌ను బోధిస్తున్నాడని సమాచారం. ఇప్పటికే అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు కొడుకు వ్యవహారంతో షాక్ తగలగా..ఆయన అనుచరుడు ఛోటా షకీల్‌కు కూడా అదే పరిస్థితి ఎదురైంది. దావూద్ కొడుకు మోయిన్ నవాజ్ (31) ఇస్లాం మత ప్రబోధకుడి (మౌలానా)గా మారడంతో అతను డిప్రెషన్‌కు గురైనట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దావూద్, అతని ప్రధాన అనుచరుడు ఛోటా షకీల్ కొడుకు కూడా ఆధ్యాత్మిక జీవితానికే మొగ్గుచూపడంతో ముంబై అండర్‌వరల్డ్‌లో తీవ్ర అలజడి నెలకొంది. దీంతో డీ-గ్యాంగ్ సృష్టించిన కోట్ల రూపాయల అధో ప్రపంచానికి వారసుడు కరువయ్యాడని కొందరు చెప్తున్నారు. కాగా, ముబషీర్ అంటే మంచి వార్తలు మోసుకురావడం అని అర్థం. దావూద్ కొడుకు స్ఫూర్తితో ముబషీర్ ఈ నిర్ణయం తీసుకున్నాడని పలువురు భావిస్తున్నారు. -
దావూద్ ఇబ్రహీం మృతి?
-
దావూద్ ఇబ్రహీం మృతి?
పాక్ మీడియాలో కథనం.. నిజం కాదన్న చోటా షకీల్ న్యూఢిల్లీ: మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం (61) తీవ్ర గుండెపోటుతో శుక్రవారం కరాచీలో మృతిచెందినట్లు పాకిస్తాన్ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. అయితే అతడు గుండెపోటుతో కరాచీలోని ఆగాఖాన్ ఆస్పత్రిలో చేరారని, పరిస్థితి విషమంగా ఉందని కూడా వార్తలు వచ్చాయి. ఈ వార్తలను దావూద్ చిరకాల సన్నిహితుడు చోటా షకీల్ తోసిపుచ్చారు. దావూద్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడని ఓ టీవీ చానల్‌కు చెప్పాడు. 257 మందిని బలిగొన్న 1993 నాటి ముంబై బాంబు పేలుళ్ల కేసులో దావూద్‌ను పట్టుకోవడానికి భారత్ యత్నిస్తున్న సంగతి తెలిసిందే. దావూద్ తమ దేశంలో లేడని చెప్పేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం అతని ఆరోగ్య వివరాలను బయటపెట్టడం లేదని భారత నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 19న కరాచీలోని తన అల్లుడి ఇంట్లో జరిగిన విందులో దావూద్ చివరిసారిగా బయటి ప్రపంచానికి కనిపించాడని నిఘా వర్గాల సమాచారం.