అత్యంత పొడవైన సముద్ర వంతెన

Date set for mega Hong Kong-China bridge opening - Sakshi

చైనాలో 24న ప్రారంభం

బీజింగ్‌: చైనా మరో ఇంజనీరింగ్‌ అద్భుతాన్ని ఆవిష్కరించడానికి సిద్ధమైంది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన సముద్ర వంతెన అక్టోబర్‌ 24న ప్రారంభించనున్నట్లు ఆ దేశ అధికారిక న్యూస్‌ ఏజెన్సీ జినుహా తెలిపింది. పెరల్‌ నది డెల్టాలోని హాంకాంగ్‌– జుహై– మకావు నగరాలను కలుపుతూ నిర్మించిన ఈ వంతెనను ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ప్రారంభించనున్నారు. 55 కి.మీ. పొడవున్న ఈ వంతెన 22.9 కి.మీ. సముద్రంపై, 6.7 కి.మీ. సొరంగంలో ఉంది.

రూ. వేలాది కోట్లు ఖర్చుపెట్టిన ఈ నిర్మాణం 2009 డిసెంబర్‌లో మొదలైంది. ఈ వంతెనను హాంకాంగ్‌ ఎయిర్‌పోర్టుతో అనుసంధానించడం వల్ల లంటూ ద్వీపంలో విపరీతమైన ట్రాఫిక్‌ ఏర్పడుతుందని హాంకాంగ్‌ ప్రజాప్రతినిధులు హెచ్చరించినా ఖాతరు చేయలేదు. కాగా, ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు లేవంటూ పలు ట్రాన్స్‌పోర్ట్‌ ఆపరేటర్లు తమ వాహనాలను నడపడానికి నిరాకరిస్తున్నారు. మరోవైపు రవాణాశాఖ ఈ వంతెనపై నడిపేందుకు ఇప్పటికే 5 వేల ప్రైవేట్‌ కార్లకు అనుమతినిచ్చింది.

బ్రిడ్జి ప్రత్యేకతలివీ..
♦   ఇది ప్రపంచంలోనే పొడవైన సముద్ర వంతెన కాగా, ప్రపంచంలో అన్ని వంతెనల్లోకెల్లా ఆరో స్థానంలో ఉంది.  
   దీని నిర్మాణానికి 4లక్షల టన్నుల ఉక్కును వినియోగించారు.
   భూకంపాలు, తుఫాన్లను తట్టుకునేలా నిర్మించారు. ఇది రెండు కృత్రిమ దీవుల్ని కలుపుతుంది.
   ప్రస్తుతం హాంకాంగ్‌ నుంచి జుహైకి ప్రయాణ సమయం 3 గంటలు కాగా, వంతెన వల్ల అది 30 నిమిషాలకు తగ్గనుంది.
    ఇంజనీరింగ్‌ అద్భుతాన్ని సృష్టించడానికన్నా ముందుగా ఇక్కడి ‘గ్రేటర్‌ బే ఏరియా’ను ‘ఎకానమిక్‌ హబ్‌’గా రూపొందించాలన్న లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్‌ చేపట్టినట్టు చైనా చెబుతోంది.
    పలు రకాల ఎగుమతులను పెరల్‌æనది పశ్చిమం నుంచి తూర్పునకు రవాణా చేయడంలో ఈ వంతెన ప్రధాన పాత్ర పోషించనుంది.
    2030నాటికి ఈ వంతెనపై రోజుకు 29 వేలకు పైగా వాహనాలు నడుస్తాయని అంచనా.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top