అమ్మో.. ఇలాంటి పనికి ఎంత ధైర్యం కావాలో.. | Daredevil free climbs Shanghai skyscraper to get a better view | Sakshi
Sakshi News home page

అమ్మో.. ఇలాంటి పనికి ఎంత ధైర్యం కావాలో..

Jun 13 2016 7:40 PM | Updated on Sep 4 2017 2:23 AM

అమ్మో.. ఇలాంటి పనికి ఎంత ధైర్యం కావాలో..

అమ్మో.. ఇలాంటి పనికి ఎంత ధైర్యం కావాలో..

సహజంగా ఓ పెద్ద భవంతి పైకి ఎక్కి అక్కడి నుంచి కిందకు చూడాలంటేనే గుండెలు జారీ పడినట్లు అనిపిస్తుంది. అలాంటిది వందల మీటర్లు ఎత్తున్న భవనం.. దానిపైన ఓ సన్నటి పిల్లర్ లాంటి నిర్మాణంపైకి ఎక్కితే..

షాంఘై: సహజంగా ఓ పెద్ద భవంతి పైకి ఎక్కి అక్కడి నుంచి కిందకు చూడాలంటేనే గుండెలు జారీ పడినట్లు అనిపిస్తుంది. అలాంటిది వందల మీటర్లు ఎత్తున్న భవనం.. దానిపైన ఓ సన్నటి పిల్లర్ లాంటి నిర్మాణంపైకి ఎక్కి దానిపైన నిల్చోవడమే కాకుండా తాపీగా కూర్చుని కాళ్లు ఊపుకుంటూ కింద చీమల్లాగా కదులుతున్న బస్సులను, పిట్టగూళ్లలా కనిపిస్తున్న ఇళ్లను చూసి ఓ వీడియోకు ఫోజిస్తే.. షాంఘైలో ఓ యువకుడు ఇలాగే అదిరిపడే సాహసం చేశాడు.

షాంఘైలోని పెద్ద భవనంపైకి ఎక్కి దానిపైన ఉన్న ఓ పిల్లర్ లాంటి నిర్మాణం చివర వరకు ఎలాంటి సహాయం రక్షణ కవచాలు లేకుండానే పాకేసి హాయిగా కూర్చున్నాడు. అనంతరం ఓ వీడియోకు పోజిచ్చాడు. సెల్ఫీలు తీసుకున్నాడు. అయితే, అతడు అంత ఎత్తు ఎక్కిన తర్వాత కూడా అతడికి ఇంకా సంతోషంకలగలేదంట. అందుకే అతడు మరో ఎత్తయిన నిర్మాణం ఎక్కబోతున్నాడంట.

Advertisement
 
Advertisement
Advertisement