చంపి ముక్కలు చేసి ఫ్రిజ్ లో దాచాడు! | Danish man arrested for storing female genitalia in south africa | Sakshi
Sakshi News home page

చంపి ముక్కలు చేసి ఫ్రిజ్ లో దాచాడు!

Sep 19 2015 8:21 PM | Updated on Sep 3 2017 9:38 AM

చంపి ముక్కలు చేసి ఫ్రిజ్ లో దాచాడు!

చంపి ముక్కలు చేసి ఫ్రిజ్ లో దాచాడు!

ఓ మహిళను దారుణంగా హత్య చేసి ఆమె మృతదేహాన్ని ముక్కలుగా చేసిన కేసులో ఓ వ్యక్తిని దక్షిణాఫ్రికా పోలీసులు అరెస్టు చేశారు.

జోహన్నెస్ బర్గ్ : ఓ మహిళను దారుణంగా హత్య చేసి ఆమె మృతదేహాన్ని ముక్కలుగా చేసిన కేసులో ఓ వ్యక్తిని దక్షిణాఫ్రికా పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. జెనిటాలియా అనే మహిళను దారుణంగా హత్యచేసిన ఓ డానిష్ వ్యక్తిని అరెస్టుచేశారు. ఆ మహిళ మృతదేహాన్ని కిరాతకంగా 21 ముక్కలుగా చేయడంతో పాటు ప్లాస్టిక్ కవర్లో ఉంచి ఫ్రీజ్ లో భద్రపరిచాడు. మృతదేహం నుంచి వాసన వస్తుందేమోనని భావించిన నిందితుడు ఈ పని చేసి ఉండొచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.

అతని ఇంట్లో మత్తు ఇచ్చే పరికరాలు, ఆపరేషన్ చేసే పరికరాలు లాంటివి గుర్తించారు. ఆ వ్యక్తి వల్ల గతంలో ఎవరికైనా హాని జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దక్షిణాఫ్రికాలోని సెంట్రల్ ఫ్రీ స్టేట్ ప్రాంతంలో అనుమానాస్పదంగా కనిపించిన నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. జెనిటాలియాపై ఏమైనా అఘాయిత్యానికి పాల్పడ్డాడా అనే విషయాలు తెలియాల్సి ఉందన్నారు.  సోమవారం అతడిని స్థానిక కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు. నిందితుడి వల్ల గతంలో ఎవరైనా లైంగిక దాడులకు గురయినట్లయితే తమను సంప్రదించి వివరాలు తెలపాలని పోలీసు అధికారి హంగ్వాని ములాడ్జి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement