గాల్లోంచి ముడిచమురు | Crude oil from the air | Sakshi
Sakshi News home page

గాల్లోంచి ముడిచమురు

Jun 15 2017 4:39 AM | Updated on Sep 5 2017 1:37 PM

గాల్లోంచి ముడిచమురు

గాల్లోంచి ముడిచమురు

మంత్రాలకు చింతకాయలు రాలుతాయో లేదో కానీ టెక్నాలజీ చేతిలో ఉంటే మాత్రం గాల్లోంచి ముడిచమురు పుట్టించవచ్చు!

మంత్రాలకు చింతకాయలు రాలుతాయో లేదో కానీ టెక్నాలజీ చేతిలో ఉంటే మాత్రం గాల్లోంచి ముడిచమురు పుట్టించవచ్చు! అదెలా అనుకుంటున్నారా.. ఫిన్‌లాండ్‌లోని వీటీటీ టెక్నికల్‌ రీసెర్చ్‌ సెంటర్, లాపెన్‌రాంటా యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీలు (ఎల్‌యూటీ) సంయుక్తంగా ఇప్పుడీ విషయాన్ని నిరూపించాయి. ఇంకెందుకు ఆలస్యం.. ఆ టెక్నాలజీ ఏదో మనమూ తెచ్చేసుకుంటే పోలా? బోలెడంత కలిసొస్తుంది అనుకుంటున్నారా? దానికి ఇంకా టైముంది లెండి. రోజుకు 200 లీటర్ల ముడిచమురుకు సమానమైన ఇంధనాన్ని తయారు చేసే ఓ నమూనా యంత్రాన్ని ఈ రెండు యూనివర్సిటీలు ఇటీవలే ఏర్పాటు చేశాయి.

గాల్లోని కార్బన్‌డయాక్సైడ్, నీటిని వేరు చేసి, ఆ నీటిని మళ్లీ విడగొట్టి హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడం, కార్బన్‌డయాక్సైడ్, హైడ్రోజన్‌ను కలిపి ముడిచమురు లాంటి ఇంధనాన్ని తయారు చేయడం ఈ ప్లాంటు ఉద్దేశం. ఈ టెక్నాలజీతో గాల్లోని కార్బన్‌డయాక్సైడ్‌నే మళ్లీ మళ్లీ వాడతారు కాబట్టి.. ఇది పర్యావరణ సమతుల్యానికి ఎంతో ఉపయోగపడుతుందని అంచనా. థర్మల్‌పవర్‌ ప్లాంట్ల నుంచి వెలువడే కార్బన్‌డయాక్సైడ్‌ను ఒడిసిపట్టి ఇంధనంగా మారిస్తే కాలుష్యాన్ని తగ్గించొచ్చని ఎల్‌యూటీ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ జెరో అహోలా చెబుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement