కాకుల్లోనూ వస్తుమార్పిడి | Crows also prepare the plans as a precaution | Sakshi
Sakshi News home page

కాకుల్లోనూ వస్తుమార్పిడి

Jul 24 2017 2:39 AM | Updated on Sep 5 2017 4:43 PM

కాకుల్లోనూ వస్తుమార్పిడి

కాకుల్లోనూ వస్తుమార్పిడి

భవిష్యత్తు భద్రంగా ఉండాలని ముందు జాగ్రత్తగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం, వాటి ప్రకారమే నడుచుకోవడం మనలో చాలామందికి అలవాటే.

భవిష్యత్తు భద్రంగా ఉండాలని ముందు జాగ్రత్తగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం, వాటి ప్రకారమే నడుచుకోవడం మనలో చాలామందికి అలవాటే. అయితే ఈ అలవాటు మనుషు లకు మాత్రమే కాకుండా కాకులకు కూడా ఉందట. స్వీడన్‌లోని లండ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. కాకులు తమ మనుగడను శాశ్వతం చేసుకునేందుకు రకరకాల పద్ధతులను అనుసరించడాన్ని గుర్తించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందులో వస్తుమార్పిడి వంటివి కూడా ఉన్నాయని వెల్లడించారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన పద్ధతిని ఎంచుకొని, తమను తాము కాపాడుకుంటాయట.

అయితే ఈ పద్ధతులను ఎంచుకునే సమయంలో స్వీయనియంత్రణను పాటించడం, పలు రకాలుగా ఆలోచించడం, ఎంచుకోవడానికి కాస్త సమయం తీసుకోవడం వంటివి కాకుల్లో ఉన్న ఉత్తమ గుణాలని శాస్త్రవేత్తలు తెలిపారు. కేవలం మనుషుల్లో మాత్రమే కనిపించే ఈ లక్షణాలను గతంలో చింపాజీల్లో గమనించామని, అంతకు మించిన పరిణితిని కాకులు కనబర్చడం ఆశ్చర్యపర్చిందని పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్‌ ఓస్వాత్‌ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement