కరోనాతో మరో ముప్పు

corona virus causes brain complications as cases found across the globe: Lancet - Sakshi

కరోనాతో  మెదడు, నాడీ సంబంధిత సమస్యలు

మెదడు వాపు వచ్చే అవకాశం

లండన్‌ : కరోనా మహమ్మారిని నిలువరించేందుకు ప్రపంచ దేశాలు అష్టకష్టాలు పడుతున్నసమయంలో మరో సంచలన విషయం వెలుగు చూసింది. కోవిడ్‌-19 రోగుల్లో పలు రకా మెదడు, నాడీ సంబంధిత సమస్యలను గుర్తించామని లండన్‌ పరిశోధకులు తాజాగా వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సమస్యలను గుర్తించినట్టు పరిశోధకులు  తెలిపారు.

లివర్‌పూల్ విశ్వవిద్యాలయం సహా, ఇతర శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం కరోనా రోగుల్లో స్ట్రోక్స్, మతిమరుపు ఇతర నాడీ సంబంధిత,మానసిక సమస్యలను కరోనాకు భారీగా ప్రభావితమైన దేశాలు నివేదించాయి. ది లాన్సెట్ న్యూరాలజీలో ప్రచురించిన ఈ అధ్యయనాల ప్రకారం గందరగోళం, స్ట్రోక్, మెదడు వాపు, వెన్నుపాము, నరాల వ్యాధి వంటి ఇతర సమస్యలు కూడా సంభవించవచ్చని పరిశోధకులు వెల్లడించారు. దాదాపు వెయ్యి మంది రోగులు ఇలాంటి సమస్యలకు గురైనారన్నారు. ఇవి అరుదుగా కనిపించే సమస్య లైనప్పటికీ, బాధితుల సంఖ్య చాలా ఎక్కువుగా ఉంటుందని లివర్‌పూల్ విశ్వవిద్యాలయం అధ్యయనవేత్త సుజన్నా లాంత్ అన్నారు. 

ప్రధానంగా బాధితుల్లో వినాశకర, తీవ్ర పరిణామాలకు దారితీసేఎన్‌సెఫలిటిస్ (మెదడులో ఇన్ఫెక్షన్‌ లేదా వాపు) ముప్పు ఒకటనీ ఈ విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా వైద్యులు గుర్తించడం చాలా ముఖ్యమని మరో శాస్త్రవేత్త అవా ఈస్టన్ చెప్పారు. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఇటువంటి సమస్యలుండగా, దీనిపై సమగ్ర వివరాలు తమకు అందలేదని పేర్కొన్నారు.  ఈ అంశంపై పూర్తి అవగాహన రావాలంటే  ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన  డేటాను  సమీక్షించాల్సి ఉందన్నారు.

మరోవైపు ఇటీవల ‘బ్రెయిన్‌’ పత్రికలో ప్రచురించిన పరిశోధన ప్రకారం అత్యంత అరుదైన, మెదడులో మంట పుట్టించే ఏడీఈఎం అనే ఇన్ఫెక్షన్‌ కరోనా వచ్చిన వారిలో పెరుగుతోంది. కరోనా విస్తరిస్తున్న క్రమంలో ఈ తరహా బాధితుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా మెదడులో మంటతో పాటు, డెలిరియం, బ్రెయన్‌ స్ట్రోక్‌ వంటి ప్రమాదకర పరిస్థితులు తలెత్తే అవకాశముందని  పరిశోధనలో తేలినట్టు నివేదించింది.
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

08-08-2020
Aug 08, 2020, 12:40 IST
మాజీ ఎంపీ నంది ఎల్లయ్య(78) కన్నుమూశారు.
08-08-2020
Aug 08, 2020, 11:05 IST
సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో ప్రజాప్రతినిధులను కరోనా భయం వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకగా తాజాగా...
08-08-2020
Aug 08, 2020, 10:19 IST
రాజమహేంద్రరం క్రైం: పాజిటివ్‌గా నిర్ధారణ అయిన 252 మందికి ఖైదీలకు రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్‌లోనే చికిత్స అందించేందుకు ప్రభుత్వం చర్యలు...
08-08-2020
Aug 08, 2020, 10:02 IST
మహాముత్తారం : ప్రపంచమంతా కరోనా మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో చికెన్‌కు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. లాక్‌డౌన్‌ సమయంలో చికెన్‌ తింటే...
08-08-2020
Aug 08, 2020, 09:16 IST
కరోనా వైరస్‌ కమ్యూనిటీ దశలో వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరముంది. గుంపులు గుంపులుగా కాకుండా భౌతిక...
08-08-2020
Aug 08, 2020, 08:55 IST
హైదరాబాద్‌: ఔషధ తయారీ సంస్థ అరబిందో ఫార్మా పలు వైరస్‌లకు సంబంధించిన  వ్యాక్సిన్ల అభివృద్ధిలో నిమగ్నమైంది. ఇందులో కోవిడ్‌–19 వ్యాక్సిన్‌...
08-08-2020
Aug 08, 2020, 08:41 IST
సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరగుతున్నాయి.. వరుసగా మూడో రోజు 2వేలకు పైగా కేసులు నమోదయ్యాయి....
08-08-2020
Aug 08, 2020, 08:39 IST
సాక్షి, హైదరాబాద్‌: విశ్వనగరంపై కరోనా విశ్వరూపం ప్రదర్శిస్తోంది. ప్రస్తుతం 80 శాతం మందిలోఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు కానీ.. పరీక్షల్లో...
08-08-2020
Aug 08, 2020, 07:18 IST
చెన్నేకొత్తపల్లి: ఇష్టం లేని పెళ్లిని తప్పించుకునేందుకు ఓ యువకుడు తనకు కరోనా సోకిందంటూ ప్రచారం చేసుకున్నాడు. క్వారంటైన్‌లో ఉన్నానంటూ బంధువులకు...
08-08-2020
Aug 08, 2020, 05:09 IST
సాక్షి, అమరావతి: ఏపీలో గడిచిన 24 గంటల్లో ఆస్పత్రుల నుంచి 7,594 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో కరోనా నుంచి...
08-08-2020
Aug 08, 2020, 04:00 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని కోవిడ్‌ ఆస్పత్రుల్లో వైద్యం, ఇతర సంబంధిత సేవల కోసం 11,200 మంది సిబ్బందిని నియమిస్తున్నామని సీఎం...
08-08-2020
Aug 08, 2020, 03:52 IST
సామాజిక ఆసుపత్రుల్లో కూడా ఆక్సిజన్‌ బెడ్లను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు.
07-08-2020
Aug 07, 2020, 19:44 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 62,938 కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా 10,171 పాజిటివ్‌ కేసులు...
07-08-2020
Aug 07, 2020, 19:31 IST
సాక్షి, హైద‌రాబాద్‌: టాలీవుడ్‌కు క‌రోనా గండం ప‌ట్టిన‌ట్లు క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే దర్శ‌కుడు తేజ‌, ఆర్ఆర్ఆర్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి, సింగ‌ర్ స్మిత‌ క‌రోనా బారిన...
07-08-2020
Aug 07, 2020, 18:02 IST
సాక్షి, అమరావతి : కరోనా నివారణా చర్యలు, వైద్య సేవలు, పరిశోధనలు, సాంకేతిక అంశాలపై బ్రిటన్‌ దౌత్యాధికారులతో శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి...
07-08-2020
Aug 07, 2020, 17:27 IST
సాక్షి, న్యూఢిల్లీ: పూణేకు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్​ ఇండియా (ఎస్‌ఐఐ) అతితక్కువ ధరలో కోవిడ్-19 వాక్సీన్ అందుబాటులోకి తెచ్చేందుకు కీలక భాగస్వామ్యాన్ని ప్రకటించింది....
07-08-2020
Aug 07, 2020, 16:50 IST
రెండు రోజుల క్రితమే మా సమీప బందువుకు కోవిడ్ సోకి చాలా సీరియస్ అయ్యింది.  వెంటనే నాకు తెలిసిన స్వామి నాయుడు...
07-08-2020
Aug 07, 2020, 14:58 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఏ కాల‌మైనా స‌రే, ఏ విప‌త్తులు వ‌చ్చినా స‌రే భార‌తీయులు వారి అల‌వాట్లు, ఇష్టాయిష్టాలు మార్చుకోలేరు. డ‌బ్బులు కూడ‌బెట్టి...
07-08-2020
Aug 07, 2020, 14:05 IST
సాక్షి, అమరావతి : కోవిడ్‌-19 నివారణా చర్యలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు....
07-08-2020
Aug 07, 2020, 13:43 IST
న్యూయార్క్‌: మహమ్మారి కరోనా వ్యాప్తి భయాల నేపథ్యంలో సైబర్‌ నేరగాళ్ల కార్యకలాపాలు విపరీతంగా పెరిగాయని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. ఈ...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top