కరోనా పడగ

Corona Cases Reach Ten Lakhs Around The World - Sakshi

ప్రపంచవ్యాప్తంగా 10 లక్షలకు చేరువలో కేసులు

కరోనా కరాళ నృత్యం చేస్తోంది. అగ్రరాజ్యం అమెరికా చిగురుటాకులా వణికిపోతోంది. యూరప్‌ దేశాలు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి. ప్రధానంగా ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్‌లలో కరోనా కోరలు చాచింది. ప్రపంచవ్యాప్తంగా 10 లక్షలకు చేరువలో కేసులు ఉండగా కోవిడ్‌ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 50 వేలను మించిపోయింది. ఇంతటి ఘోర కలిని ఊహించని ప్రపంచ దేశాలు దీనిని ఎలా ఎదుర్కోవాలో తెలీక గందరగోళంలో పడిపోయాయి.

వాషింగ్టన్‌ /పారిస్‌/రోమ్‌
అగ్రరాజ్యానికి ఊపిరాడటం లేదు: అగ్రరాజ్యం అమెరికాలో రోజురోజుకీ కరోనా కేసులు, మృతుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఇప్పటికే 2 లక్షల 36 వేలకు పైగా కేసులు నమోదైతే, మృతుల సంఖ్య 5,700 చేరుకుంది. న్యూయార్క్‌ రాష్ట్రంలో ఆరువారాల వయసున్న చిన్నారి మరణించడం అందరినీ కలచివేస్తోంది. అయినా సరే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ లాక్‌డౌన్‌ ప్రకటించడానికి అంగీకరించడం లేదు. ఒకవైపు భారీగా పెరిగిపోతున్న కేసులు, వైద్య సదుపాయాలు పూర్తి స్థాయిలో అందించలేకపోవడంతో అగ్రరాజ్యం ఎన్నడూ ఎదుర్కోని సంక్షోభ పరిస్థితుల్లో చిక్కుకుంది. (కరోనా: అపోహలూ... వాస్తవాలు)

మాస్క్‌లు, గ్లౌవ్స్, శానిటైజర్లు, వెంటిలేటర్లు, ఇతర వైద్య పరికరాలకి కొరత ఉందని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ అధికారులు వెల్లడించారు. గత కొన్ని దశాబ్దాల్లో ఈ స్థాయి ముప్పుని అగ్రరాజ్యం ఎప్పుడూ ఎదుర్కోలేదు. దేశవ్యాప్తంగా ఇప్పటికిప్పుడు లాక్‌డౌన్‌ నిర్ణయాన్ని అమలు చేసినప్పటికీ అమెరికాలో లక్ష నుంచి 2 లక్షల మంది వరకు మరణించవచ్చునని కరోనాపై పోరాటానికి వైట్‌హౌస్‌ ఏర్పాటు చేసిన టాస్క్‌ ఫోర్స్‌ అంచనా వేస్తోంది. అయితే ప్రజలు ఇంటిపట్టునే ఉండేలా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చర్యలు తీసుకుంది. 33 కోట్ల మంది జనాభా ఉన్న అమెరికాలో గత నెల రోజులుగా 27 కోట్ల మంది ఇంటిపట్టునే ఉంటున్నారు. విద్యాసంస్థలన్నీ మూసివేశారు. రవాణా, పర్యాటక రంగాలు స్తంభించాయి. (కరోనా: భయంకర వాస్తవం!)

భారత్‌లో ఉన్న అమెరికన్లు వెనక్కి: కరోనా ముప్పుతో వివిధ దేశాలు అంతర్జాతీయ సరిహద్దుల్ని మూసివేయడంతో దాదాపుగా 30 వేల మందికి పైగా అమెరికా పౌరులు ఇతర దేశాల్లో చిక్కుకుపోయారు. వారిని వెనక్కి రప్పించడానికి అమెరికా ఏర్పాట్లు చేస్తోంది. భారత్‌లో ఉన్న అమెరికన్లు తిరిగి స్వదేశానికి తీసుకువచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టింది. భారత్‌ లాక్‌డౌన్‌ సమయంలో అక్కడే ఉండిపోయిన ఈ తరుణంలో భారత ప్రభుత్వం తమకు చాలా సాయం చేస్తోందని అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ వారాంతం నుంచి న్యూఢిల్లీ, ముంబై నుంచి ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి అమెరికన్లను వెనక్కి తెస్తామని తెలిపింది.

ఆరోగ్య సదుపాయాలు పటిష్టంగా ఉండే స్పెయిన్‌లో ఒక్కరోజే 950 మంది మరణించారు. దీంతో మృతుల సంఖ్య పదివేలు దాటి పోయింది. ఇక కేసుల విషయానికి వస్తే లక్షా 10 వేలు దాటిపోయాయి. అయితే గత వారంతో పోల్చి చూస్తే కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టిందనే చెప్పాలి.  

బ్రిటన్, ఫ్రాన్స్‌లో మృతుల సంఖ్య ఎక్కువవుతూ ఉంటే, ఇటలీలో కేసులు, మృతుల సంఖ్య కాస్త తగ్గుముఖం పడుతోంది. 

తమ దేశంలో ఒక్క కరోనా వైరస్‌ కేసు కూడా నమోదు కాలేదని ఉత్తర కొరియా ప్రకటించింది. చైనాలో కొత్త వ్యాధి బయటకు వచ్చిందని తెలియగానే జనవరిలోనే తాము సరిహద్దులన్నింటినీ మూసేశామని, అందుకే ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు 

కరోనా వైరస్‌ కారణంగా కేవలం వృద్ధులే ప్రాణాలు కోల్పోతారన్నది వాస్తవం కాదని, యువకుల్లో రోగనిరోధక శక్తి లేని వారు కూడా చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

దేశం గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కోబోతోంది : ట్రంప్‌ 
కరోనాపై అన్ని వైపుల నుంచి యుద్ధం చేస్తున్నామని, ఎలాగైనా వైరస్‌పై విజయం సాధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అన్నారు. ఈ వైరస్‌ అత్యంత ప్రమాదకరమైనదని పెరిగిపోతున్న కేసుల సంఖ్య చూస్తే తెలుస్తుందన్నారు. ‘‘వైరస్‌పై పోరాటంలో భాగంగా ఎన్నో చర్యలు తీసుకున్నాం. భౌతిక దూరం, పనిచేసేవారికి ఆర్థిక సాయం, వైద్య సదుపాయాలు, విదేశీ ప్రయాణాలు రద్దు, కరోనాకు మందులు, వ్యాక్సిన్‌ కనిపెట్టే ప్రక్రియలు చేపట్టడం వంటివన్నీ ఎన్నో చేశాం. మరే దేశానికంటే ముందే ఈ చర్యలన్నీ తీసుకున్నాం’’అని ట్రంప్‌ మీడియాతో పేర్కొన్నారు. ‘‘రాబోయే రోజుల్లో దేశం చాలా గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కోబోతోంది. రెండు మూడు వారాలు చాలా సంక్లిష్టమైన కాలం. ఇలాంటి సవాళ్లను ఎదుర్కొనే సమయంలో అమెరికన్లు ఎప్పుడూ కుంగిపోరు. భయపడిపోరు. కలసికట్టుగా ఎదుర్కొంటారు’ అని అన్నారు.

గత ఐదు రోజుల్లో ఆయా దేశాల్లో కరోనా కేసులు, మృతులు ఇలా

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

31-05-2020
May 31, 2020, 06:01 IST
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా రోజు రోజుకూ విస్తరిస్తుండడంతో ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా చికిత్స అందించడం ప్రారంభిస్తే ఎలా ఉంటుందంటూ...
31-05-2020
May 31, 2020, 05:37 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌ మరణాల రేటు గణనీయంగా మరింత తగ్గింది. దేశవ్యాప్తంగా సగటు మరణాలు 2.86 శాతంగా ఉంటే.....
31-05-2020
May 31, 2020, 04:57 IST
సాక్షి ముంబై/షిర్డీ: మహారాష్ట్రలో ఒక వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుండగా కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా...
31-05-2020
May 31, 2020, 04:38 IST
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం ప్రదర్శిస్తోంది. లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నప్పటికీ వైరస్‌ వ్యాప్తి వేగంగా పెరిగిపోతోంది. కరోనా పాజిటివ్‌...
31-05-2020
May 31, 2020, 04:26 IST
కరోనా మహమ్మారి భారత్‌ను వణికిస్తోంది. లాక్‌డౌన్‌ని కట్టుదిట్టంగా అమలు చేసినప్పటికీ రోజు రోజుకీ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మరికొన్ని...
31-05-2020
May 31, 2020, 04:14 IST
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా శనివారం దేశ పౌరులకు బహిరంగ లేఖ...
31-05-2020
May 31, 2020, 04:04 IST
బీజింగ్‌: కరోనా వైరస్‌ను అంతమొందించేందుకు తాము తయారు చేసిన వ్యాక్సిన్‌ 99 శాతం పని చేస్తుందని చైనాకు చెందిన బయోఫార్మాసూటికల్‌...
31-05-2020
May 31, 2020, 03:45 IST
వాషింగ్టన్‌: ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)తో తెగదెంపులు చేసుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి విషయంలో...
31-05-2020
May 31, 2020, 02:39 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో శనివారం 74 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఆరుగురు చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య ఇప్పటివరకు...
31-05-2020
May 31, 2020, 01:43 IST
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి విస్తరణను అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకొచ్చిన లాక్‌డౌన్‌ నుంచి నిష్క్రమణకు రంగం సిద్ధమైంది. కంటైన్‌మెంట్‌(కట్టడి)...
31-05-2020
May 31, 2020, 01:05 IST
‘‘ఆర్‌జీవీ వరల్డ్‌’లో నా అభిరుచికి తగ్గ సినిమాలే ఉంటాయి. చూడాలనుకున్నవాళ్లే చూస్తారు. నా సినిమాలతో ప్రతి ఒక్కరిని సంతృప్తిపరచాలనే ఉద్దేశం...
30-05-2020
May 30, 2020, 22:30 IST
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 74 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.
30-05-2020
May 30, 2020, 21:12 IST
న్యూఢిల్లీ: కరోనా క్లిష్ట సమయంలో కూడా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ రాజకీయ విమర్శలకు దిగుతున్నారని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ...
30-05-2020
May 30, 2020, 20:45 IST
వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభిస్తున్నా ‘డోంట్‌ కేర్‌’ అంటూ గడిపేస్తున్నారు అమెరికన్లు. కరోనా మరణాలు లక్ష దాటినా అమెరికా...
30-05-2020
May 30, 2020, 19:30 IST
న్యూఢిల్లీ: కరోనా చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లేందుకు ప్రజలు వెనకడుగు వేస్తున్నట్టు తెలిసింది. కోవిడ్‌ చికిత్సలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల సేవలపై...
30-05-2020
May 30, 2020, 17:42 IST
లాక్‌డౌన్ సడలింపులతోనే నగరాల్లో కరోనా కేసుల సంఖ్య అధికమవుతోందని వెల్లడించారు.
30-05-2020
May 30, 2020, 17:15 IST
అంటే కరోనా కేసులు బయట పడకుండానే పాడె కడుతున్నాయా అన్న అనుమానం కలుగుతోంది.
30-05-2020
May 30, 2020, 17:04 IST
గడిచిన 24 గంటల్లో 114 మంది పోలీసులు కోవిడ్‌ బారిన పడ్డారు. దాంతో రాష్ట్ర పోలీసుల్లో కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య...
30-05-2020
May 30, 2020, 16:29 IST
ముంబై: మహమ్మారి కరోనాతో అతలాకుతలమవుతున్న మహారాష్ట్ర శనివారం కాస్త ఊరటనిచ్చే కబురును పంచుకుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా కోవిడ్‌...
30-05-2020
May 30, 2020, 15:55 IST
లక్నో : తన చావుకు లాక్‌డౌన్‌ పొడిగింపే కారణమంటూ ఒక వ్యక్తి సూసైడ్‌ నోట్‌ రాసి పెట్టి శుక్రవానం రైలు కింద...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top