ఆలయానికి జరిమానా వేశారు! | Chinese temple fined for illegal possession of a lion | Sakshi
Sakshi News home page

ఆలయానికి జరిమానా వేశారు!

Mar 19 2016 10:17 AM | Updated on Oct 2 2018 4:31 PM

ఆలయానికి జరిమానా వేశారు! - Sakshi

ఆలయానికి జరిమానా వేశారు!

సింహాలను ఉంచారన్న ఆరోపణలతో ఓ దేవాలయానికి జరిమానా విధించారు.

బీజింగ్: సింహాలను ఉంచారన్న ఆరోపణలతో ఓ దేవాలయానికి జరిమానా విధించారు. ఈ ఘటన చైనాలో శనివారం చోటుచేసుకుంది. షాంగ్ఘీ ప్రాంతంలోని ఓ బౌద్ధ దేవాలయంలో కొన్నేళ్లుగా సింహాన్ని ఉంచుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు దేవాలయానికి దాదాపు రూ.30 వేలు జరిమనా విధించారు.

ఆలయంలో ఉన్న సింహాన్ని 'జూ'కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. 2010లో ఈ దేవాలయానికి రెండు సింహాలను అప్పగించగా, ఓ సింహం అనారోగ్యంతో చనిపోయింది. రెండో సింహం ఆలయంలో ఉండిపోయింది. సింహాన్ని ఆలయప్రాంగణంలో ఎందుకు ఉంచుతున్నారని అధికారులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా సింహాన్ని ఆలయంలో బంధించడం విషయంపై విచారణ ప్రారంభించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement