భారత్‌ ప్రయత్నాలకు చైనా మళ్లీ అడ్డుపుల్ల

China Defends Terrorist Masood Azhar, Justifies UN - Sakshi

వాషింగ్టన్‌: పాకిస్తాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్ర సంస్థ జైషే మహ్మద్‌ అధినేత అజార్‌ మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ భారత్‌ చేసిన ప్రయత్నం మరోసారి విఫలమయింది. ఈ మేరకు భద్రతామండలిలో ప్రవేశపెట్టిన తీర్మానానికి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌ దేశాల మద్దతు ప్రకటించినప్పటికీ చైనా వీటో చేసింది. శుక్రవారం వాషింగ్టన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యి మాట్లాడారు. ‘ఈ తీర్మానంపై మండలిలోని దేశాల మధ్య ఏకాభిప్రాయం లేదు. ఈ విషయంతో నేరుగా సంబంధం ఉన్న భారత్, పాక్‌లూ భిన్నాభిప్రాయంతో ఉన్నాయి’ అని అన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top