భారత అణు ఒప్పందానికి చైనా మద్దతు! | china cautiously backs indo japan nuclear agreement | Sakshi
Sakshi News home page

భారత అణు ఒప్పందానికి చైనా మద్దతు!

Nov 14 2016 6:53 PM | Updated on Aug 13 2018 3:53 PM

భారత అణు ఒప్పందానికి చైనా మద్దతు! - Sakshi

భారత అణు ఒప్పందానికి చైనా మద్దతు!

ప్రధానమంత్రి నరేంద్రమోదీ టోక్యో పర్యటన సందర్భంగా కుదిరిన భారత్ - జపాన్ అణు ఒప్పందానికి చైనా మద్దతు తెలిపింది.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ టోక్యో పర్యటన సందర్భంగా కుదిరిన భారత్ - జపాన్ అణు ఒప్పందానికి చైనా మద్దతు తెలిపింది. అంతర్జాతీయ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందానికి కట్టుబడిన దేశాలకు శాంతియుత అవసరాల కోసం అణుశక్తిని ఉపయోగించుకోడానికి హక్కు ఉంటుందని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గెంగ్ షువాంగ్ మీడియాతో అన్నారు. భారత్-జపాన్ చేసిన సంయుక్త ప్రకటనలో దక్షిణ చైనా సముద్రం గురించిన ప్రస్తావన ఉండటంపైనా చైనా స్పందించింది. ఈ విషయంలో తాము తమ పాత విధానానికే కట్టుబడి ఉంటున్నట్లు తెలిపింది. 
 
పౌర అణు ఒప్పందం మీద సంతకాలు కుదరడానికి ముందు చైనా మీడియాలో మాత్రం దీనిపై విపరీతంగా విమర్శలు వచ్చాయి. కానీ మీడియా అభ్యంతరాలను గెంగ్ ఏమాత్రం పట్టించుకున్నట్లు కనిపించలేదు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అణుబాంబుల బారిన పడిన ఏకైక దేశమైన జపాన్.. ఇన్నాళ్ల నుంచి ఎప్పుడూ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధం గురించిన విషయాల్లో చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. జపాన్‌తో అణు ఒప్పందం కుదుర్చుకున్నా, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పీటీ) మీద సంతకాలు చేయని మొట్టమొదటి దేశం భారతదేశమే. ఎన్‌పీటీ మీద సంతకం పెట్టడానికి నిరాకరించడం వల్లే అణు సరఫరాదారుల బృందంలో భారతదేశం చేరడాన్ని చైనా గట్టిగా వ్యతిరేకిస్తోంది. కానీ, అలాంటి చైనా ఇప్పుడు జపాన్ -భారత్ ఒప్పందానికి మద్దతు పలకడం ఆశ్చర్యంగా ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement