గాలితోనే.. కారులో షికారు! | Car that runs on air | Sakshi
Sakshi News home page

గాలితోనే.. కారులో షికారు!

May 10 2015 3:04 AM | Updated on Sep 3 2017 1:44 AM

గాలితోనే.. కారులో షికారు!

గాలితోనే.. కారులో షికారు!

ఏ ఇంధనమూ అక్కర్లేదు. జస్ట్ గాలి ఉంటే చాలు! రయ్యిన దూసుకుపోతుందీ కారు. ఒకసారి గాలితో ట్యాంక్ ఫుల్ చేస్తే 482 కి.మీ. ఆగకుండా ప్రయాణించొచ్చు!

ఏ ఇంధనమూ అక్కర్లేదు. జస్ట్ గాలి ఉంటే చాలు! రయ్యిన దూసుకుపోతుందీ కారు. ఒకసారి గాలితో ట్యాంక్ ఫుల్ చేస్తే  482 కి.మీ. ఆగకుండా ప్రయాణించొచ్చు! కాకపోతే ఇందులో నింపాల్సింది  గాలితో పాటు హైడ్రోజన్ వాయువును కూడా! అమ్మో ఖర్చెంతో అంటారా? ఒకసారి హైడ్రోజన్ ట్యాంక్‌ను ఫుల్ చేసేందుకు 6,395 రూపాయలే!

పొగకు బదులుగా స్వచ్ఛమైన తాగునీటిని వదలడం ఈ కారుకున్న మరో విశేషం! హైడ్రోజన్‌ను ఇంధనంగా వాడటం వల్ల  కాలుష్యాలు విడుదల కావు. అందుకే.. హైడ్రోజన్ కార్ల తయారీపై దృష్టిపెట్టాయి కంపెనీలు. ‘టొయోటా మిరాయి’ హైడ్రోజన్ కారు ఈ ఏడాది చివర్లోగానే మార్కెట్లోకి రానుండగా.. హోండా, నిస్సాన్, ఫోర్డ్ కంపెనీలూ ఈ కార్ల ఉత్పత్తిపై కసరత్తు మొదలుపెట్టాయి. టొయోటా మిరాయి కారు.. వేగం గరిష్టంగా గంటకు 178 కిలోమీటర్లు. బ్రిటన్‌లో దీని ధర రూ. 62 లక్షలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement