పసికందును చంపిన తల్లికి జీవిత ఖైదు | Sakshi
Sakshi News home page

పసికందును చంపిన తల్లికి జీవిత ఖైదు

Published Sat, Dec 19 2015 2:07 PM

California Mom Gets Life Term for Killing Month-Old Daughter In Microwave

కాలిఫోర్నియా: అమెరికాలో నెల రోజుల ఆడశిశువును చంపిన కేసులో తల్లికి జీవిత ఖైదు పడింది. కాలిఫోర్నియా కోర్టు క యంగ్ (34) అనే మహిళకు 26 ఏళ్ల కారాగార శిక్ష విధించింది.

2011లో క యంగ్ తన బిడ్డను మైక్రోవేవ్ ఓవెన్లో ఐదు నిమిషాల పాటు ఉంచింది. తీవ్రంగా గాయపడిన పసికందు మరణించింది. కాగా యంగ్ మూర్ఛ వ్యాధితో బాధపడుతోందని, ఆ సమయంలో ఏం చేసిందో ఆమె తెలుసుకునే స్థితిలో లేదని ఆమె తరపు న్యాయవాది వాదించారు. అయితే కోర్టు ఈ వాదనలను తోసిపుచ్చుతూ క యంగ్ను దోషిగా నిర్ధారిస్తూ తీర్పు వెలువరించింది. కాగా ఆమెకు మరో ముగ్గురు పిల్లలు ఉన్నారు.
 

Advertisement
 
Advertisement