పిచ్చి పీక్స్‌కి చేరడం అంటే ఇదే.. శవపేటికలో వధువు | Bride Arrives At Her Wedding In Coffin | Sakshi
Sakshi News home page

శవపేటికలో పెళ్లి కూతురు

Nov 20 2019 9:00 PM | Updated on Nov 20 2019 9:11 PM

Bride Arrives At Her Wedding In Coffin - Sakshi

ఏ జంట అయినా పెళ్లి వేడుకను ఘనంగా జరుపుకుంటుంది. కొంతమంది అయితే తమ వివాహ వేడుక అందరికి గుర్తిండిపోయేలా వింతగా జరుపుకుంటారు. అదెలాగంటే.. కొందరు వివాహ వేడుకకి గుర్రాలపై వస్తారు. మరికొందరు కొత్తగా రెడీ చేసిన కారులో వెరైటీగా ఎంట్రీ ఇస్తారు. ఇంకొందరు గాల్లో తేలియాడుతూ రింగులు మార్చుకుంటారు. కానీ ఓ వధువు మాత్రం ఇంకాస్త వెరైటీగా తన పెళ్లి వేడుకను జరుపుకుంది. గుర్రాలు, కార్లను కాదని ఏకంగా శవపేటికలో పెళ్లి మంటపానికి వచ్చింది. శవపేటిక లోపలి నుంచి లేచి మంటపంపైకి వెళ్లింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. 

వీడియో ప్రకారం.. ఓ వధువు శవపేటికలో పడుకొని ఉంది. ఆ శవపేటికపై నల్లటి వస్త్రం కప్పి ఉంది. కళ్యాణ మంటపం దగ్గరకి రాగానే ఆ వస్త్రాన్ని తొలగించారు. అనంతరం శవపేటికలోనుంచి వధువు నవ్వుతూ లేచింది. అందరూ ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం వేదికపైకి వెళ్లి రింగులు మార్చుకున్నారు. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘  చావు కూడా మన జీవితంలో భాగమే.. అందుకే ఆమె శవపేటికలో వచ్చింది’  అని ఒకరంటే.. ‘పిచ్చి పీక్స్‌కి చేరడం అంటే ఇదే’  అంటూ మరొకరు కాంమెట్లు చేస్తున్నారు. కాగా, ఈ వింత ఘటన ఎక్కడ జరిగిందనే విషయం తెలియరాలేదు. 

Advertisement
 
Advertisement
Advertisement