సిరియాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు.
హోమ్స్: సిరియాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. సెంట్రల్ సిటీ హోమ్స్లో ఆదివారం జంట కారు బాంబు డాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో 46 మంది మృతి చెందగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. వీరిలో ఎక్కువగా సాధారణ పౌరులే ఉన్నట్లు సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ సంస్థ వెల్లడించింది. క్షతగాత్రుల్లో ఎక్కువ మంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సంస్థ వెల్లడించింది.