బ్యూటీ కాంటెస్ట్‌లో 18 మందిని వెనక్కి నెట్టి.. | Beauty Queen crowned winner at the age of 85 | Sakshi
Sakshi News home page

బామ్మకు ప్రేమతో..

Oct 25 2017 9:17 AM | Updated on Oct 25 2017 9:47 AM

Beauty Queen crowned winner at the age of 85

లండన్‌: లేటు వయసులో బ్యూటీ క్వీన్‌ కిరీటాన్ని దక్కించుకున్న 85 ఏళ్ల ఎలిజబెత్‌ లాతెగన్‌ ఆత్మవిశ్వాసం, జీవితం పట్ల ఆమె దృక్పధంపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ అందాల బామ్మ నుంచి యువత నేర్చుకోవాల్సిన అంశాలెన్నో ఉన్నాయి. బ్యూటీ క్వీన్‌గా గెలుపొందడంతో పాజిటివ్‌ మైండ్‌, కష్టించి పనిచేయడం జీవితకాలాన్ని పెంచడంతో పాటు చూపరులను ఆకట్టుకోవడం సాధ్యమేనని స్పష్టమైందని ఈ బామ్మ చెబుతోంది. కెన్సింగ్టన్‌లో జరిగిన సీనియర్‌ మహిళల బ్యూటీ కాంటెస్ట్‌లో 18 మందితో పోటీపడి ఎలిజెబెత్‌ విన్నర్‌గా నిలిచింది. ఈ పోటీలో తనకన్నా చిన్న వయసు వారినీ అధిగమిస్తూ అందాల కిరీటాన్ని ఆమె దక్కించుకుంది.

వృద్ధులకు ఆహారాన్ని అందించే మీల్స్‌ ఆన్‌ వీల్స్‌కు నిధుల కోసం స్వచ్ఛంద సంస్థ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈవెంట్‌ నిర్వాహకులు తనను గేలి చేస్తున్నారేమోనని భావించానని ఎలిజబెత్‌ చెప్పుకొచ్చారు. అయితే తర్వాత ఎలాగైనా కాంటెస్ట్‌లో పాల్గొనాలని ఎలాంటి ప్రిపరేషన్‌ లేకుండా నేరుగా పోటీకి వెళ్లి టైటిల్‌ నెగ్గానని చెప్పారు.

ఈ పోటీకి ఎంతో మంది యువతులు వచ్చినా తన గుడ్‌లుక్స్‌ జడ్జీలను ఆకట్టుకున్నాయని చెప్పారు. తాను అందంతో పాటు ధృడంగా ఉన్నానని ఈ కాంటెస్ట్‌ నిరూపించిందని అందాల బామ్మ చెప్పారు. యువతులు తమ శరీరం పట్ల జాగ్రత్తలు తీసుకుంటూ చురుకుగా ఉండాలని, ఇదే తన విజయ రహస్యమనీ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement